Duleep Trophy: దులీప్ ట్రోఫీకి స్టార్ ఆటగాళ్లు దూరం.. జడేజా, సిరాజ్‌లకు విశ్రాంతి
దులీప్ ట్రోఫీకి స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లకు కూడా మినహాయింపు ఇవ్వడం గమనార్హం. సిరాజ్, ఉమ్రాన్ అనారోగ్య కారణాల వల్ల విశ్రాంతి తీసుకోనున్నట్లు బీసీసీఐ సెలెక్టర్లు మంగళవారం స్పష్టం చేశారు.
వ్యక్తిగత కారణాలతో రవీంద్ర జడేజా దూరం
రవీంద్ర జడేజా వ్యక్తిగత కారణాలతో విశ్రాంతి కోరినట్లు తెలిసింది. సిరాజ్ స్థానంలో నవదీప్ సైనీ, ఉమ్రాన్ స్థానంలో మధ్యప్రదేశ్ పేసర్ గౌరవ్ యాదవ్‌ను ఎంపిక చేశారు. సెప్టెంబర్ 5నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. కానీ స్టార్ ఆటగాళ్ల దూరం కావడంతో అభిమానులకు నిరాశ చెందుతున్నారు.