
IPL 2025: పేరుకే స్టార్ ప్లేయర్లు.. కానీ ప్రదర్శన మాత్రం శూన్యం.. ఐపీఎల్‌లో నిరాశపరిచిన ఆటగాళ్లు వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సీజన్ పలువురు స్టార్ ఆటగాళ్లు మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు.
వేలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి తమ జట్లకు సొంతం చేసుకున్న ఆటగాళ్లు, ప్రదర్శన చేయలేక అట్టర్ ఫ్లాప్ అయ్యారు.
ఇప్పుడు ఆ అట్టర్ ఫ్లాప్ ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
Details
1. రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్)
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు రూ. 27 కోట్లకు కొనుగోలు అయిన రిషబ్ పంత్, తన ప్రతిభను నిరూపించడంలో విఫలమయ్యాడు.
11 మ్యాచ్‌ల్లో కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 99.22 కాగా, ఇది ఈ సీజన్‌లో కనీసం 100 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యల్పం.
ఒక్క అర్ధ సెంచరీ (63 పరుగులు) మాత్రమే చేశాడు. కెప్టెన్‌గా కూడా ప్రభావం చూపలేకపోయిన పంత్ కారణంగానే లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
Details
2. గ్లెన్ మాక్స్ వెల్ (పంజాబ్ కింగ్స్)
ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మాక్స్వెల్ ఈ సీజన్‌లో కూడా నిరాశే మిగిల్చాడు. పంజాబ్ తరపున ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 48 పరుగులు చేశాడు.
స్ట్రైక్ రేట్ 97.95 మాత్రమే. స్పిన్నర్ల ఎదురుగా పూర్తిగా తడబడ్డ మాక్స్వెల్, వారితో 30 పరుగులకే 6 సార్లు అవుట్ అయ్యాడు.
వేలి గాయం కారణంగా టోర్నీ మధ్యలో తప్పుకున్నా, ఆడిన మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు.
Details
3. మొహమ్మద్ షమీ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
ప్రముఖ పేసర్ మహ్మద్ షమీ ఈ సీజన్‌లో అంచనాలకు తగ్గ ఫలితాలు ఇవ్వలేకపోయాడు. 9 మ్యాచ్‌ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసాడు.
అతని బౌలింగ్ సగటు 56.17, ఎకానమీ రేట్ 11.23. ఇలా అనూహ్యంగా పేలవ ప్రదర్శన చేసిన షమీ, కొన్ని మ్యాచ్‌లకు ప్లేయింగ్ XI నుంచి తప్పించాల్సి వచ్చింది. ఇది SRH కు పెద్ద లోటే.
Details
4. జేక్ ఫ్రేజర్-మెక్ గర్క్ (ఢిల్లీ క్యాపిటల్స్)
2024లో సంచలన ఆటతీరు కనబరిచిన జేక్ ఫ్రేజర్, ఈ సీజన్‌లో పూర్తిగా డీలా పడ్డాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 55 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
అతని స్ట్రైక్ రేట్ 105.76 మాత్రమే. పేస్ బౌలర్లకు ఎదురులేకపోయిన జేక్, 6 అవుట్‌ల్లో 5సార్లు ఫాస్ట్ బౌలర్లకు చిక్కాడు.
చివరికి టీమ్ అతన్ని ప్లేయింగ్ XI నుంచి తప్పించింది.
Details
5. రచన్ రవీంద్ర (చెన్నై సూపర్ కింగ్స్)
బ్రేక్‌త్రూ సీజన్‌గా భావించిన రచన్ రవీంద్రకు ఈసారి నిరాశే ఎదురైంది. 8 ఇన్నింగ్స్‌లలో కేవలం 191 పరుగులు మాత్రమే చేశాడు. ఒకే ఒక్క అర్థ సెంచరీ మాత్రమే ఉంది.
పేసర్ల ముందు తడబడి, 87 బంతుల్లో కేవలం 107 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ 123, సగటు 21.4. ఇలా నిలకడలేని ప్రదర్శనతో CSK ఓపెనింగ్ సమస్యలను మరింత అధికం చేశాడు.
ఈ ఐదుగురు స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన వారి జట్ల విజయంపై ప్రతికూల ప్రభావం చూపించింది.