Page Loader
ENG vs IND: ఓపెనింగ్‌కి సుదర్శన్-జైస్వాల్.. గిల్‌కి మిడిలార్డర్‌లో ఛాన్స్ ఇవ్వండి: పాంటింగ్
ఓపెనింగ్‌కి సుదర్శన్-జైస్వాల్.. గిల్‌కి మిడిలార్డర్‌లో ఛాన్స్ ఇవ్వండి: పాంటింగ్

ENG vs IND: ఓపెనింగ్‌కి సుదర్శన్-జైస్వాల్.. గిల్‌కి మిడిలార్డర్‌లో ఛాన్స్ ఇవ్వండి: పాంటింగ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ వర్సెస్ టీమిండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఈ భారీ సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, మొత్తం 18 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్‌ను ఎంపిక చేశారు. ఇప్పటికే భారత జట్టు యూకేకు వెళ్లిపోయింది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో జట్టు తుది కూర్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. తొలుత ఓపెనర్ల స్థానానికి గాను కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌ల పేర్లు వినిపించగా... తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Details

సాయి సుదర్శన్ టెస్టులో రాణిస్తాడు

టాప్ ఆర్డర్‌కు సంబంధించి తన అభిప్రాయాన్ని ఐసీసీ రివ్యూలో పంచుకున్నాడు. 'సాయి సుదర్శన్ టెక్నికల్‌గా చాలా మంచి ప్లేయర్. అతను టెస్టుల్లో రాణించగలడు. జైస్వాల్‌తో కలసి ఇంగ్లాండ్‌లో ఓపెనింగ్ చేయగలడు. ఇద్దరు యువ ఆటగాళ్లు ఓపెనింగ్‌కు పంపితే మూడో స్థానంలో అనుభవం ఉన్న కేఎల్ రాహుల్ లేదా కరుణ్ నాయర్‌ను బ్యాటింగ్‌కు దించవచ్చు. ఇది గిల్‌కు బాగా సహకరిస్తుంది. గిల్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం వల్ల అతనిపై ఒత్తిడి తగ్గుతుంది. టాప్-5లో సుదర్శన్, జైస్వాల్, రాహుల్, గిల్, కరుణ్ నాయర్ ఉండొచ్చని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉండగా, జూన్ 13న ప్రారంభమయ్యే ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ అనంతరం బ్యాటింగ్ క్రమంపై నిర్ణయం తీసుకుంటామని శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు.

Details

కెప్టెన్ గా ఎంపిక కావడం అదృష్టంగా ఉంది

'బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇంకా ఖరారు చేయలేదు. 10 రోజుల లండన్ శిబిరం తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం. టెస్టు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యత వహించడం గొప్ప గౌరవం. ఇంగ్లాండ్ సిరీస్ వంటి సవాలును ఎదుర్కొనడానికి ఎదురు చూస్తున్నానని ఇంగ్లాండ్ బయలుదేరేముందు గిల్ స్పష్టం చేశాడు. ఈ సిరీస్‌లో యువ ఆటగాళ్లపై అధికంగా ఆధారపడనున్న టీమ్‌ఇండియా, అనుభవాన్ని కలిపి సమతుల్యత సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగనుంది.