
SRH vs LSG: బ్యాటింగ్‌లో అదరగొడుతున్న సన్ రైజర్స్.. నేడు 300 పరుగులు సాధించేనా!
ఈ వార్తాకథనం ఏంటి
సన్ రైజర్స్ హైదరాబాద్ కారణంగా ఐపీఎల్‌లో 300 పరుగుల మార్క్ చుట్టూ చర్చ జరుగుతోంది.
17 సీజన్లు పూర్తయినా, ఇప్పటి వరకు ప్లేఆఫ్స్ అర్హతలు, టైటిల్ గెలుపు వంటి విషయాలే చర్చకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఓ జట్టు సాధించగల స్కోరు గురించి ఆసక్తిగా చర్చ సాగుతోంది.
ఈ సీజన్‌లో 300 పరుగుల స్కోరు అందుకోవడానికి అత్యంత సమర్థమైన జట్టుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు వినిపిస్తోంది.
రాజస్థాన్ రాయల్స్‌తో తొలి మ్యాచ్ అనంతరం ఈ అంచనాలు మరింత బలపడ్డాయి. గురువారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.
Details
అద్భుత ఫామ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లు
ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన సన్‌రైజర్స్ మరో విజయాన్ని నమోదు చేయగలదన్న ఆశలు పెరిగాయి.
తొలి మ్యాచ్‌లోనే హైదరాబాద్ జట్టు తన బ్యాటింగ్ శక్తిని ప్రదర్శించింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లతో 286 పరుగుల భారీ స్కోరు సాధించింది.
హెడ్ (67), ఇషాన్ (106 నాటౌట్) దూకుడు వల్ల ప్రత్యర్థి జట్లలో భయం కలిగించింది.
ఈ ఐదుగురు ప్రధాన బ్యాటర్లు ఫామ్‌లో ఉండటం సన్‌రైజర్స్‌కు కలిసోచ్చే అంశం.
Details
బౌలింగ్ విభాగంలో మెరుగ్గా సన్ రైజర్స్
సన్‌రైజర్స్ బ్యాటింగ్ అద్భుతమైన స్థాయిలో ఉండటంతో, ప్రత్యర్థి జట్లు టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలా? బౌలింగ్ చేయాలా? అనే దానిపై రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.
బౌలింగ్ విభాగంలోనూ సన్‌రైజర్స్ సమతూకంగా ఉంది.
కెప్టెన్ పాట్ కమిన్స్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, సిమర్‌జీత్ సింగ్ వంటి పేసర్లు ఉండగా, ఆడమ్ జంపా, అభిషేక్ శర్మ స్పిన్ విభాగంలో బలాన్ని అందిస్తున్నారు.
మరోవైపు తొలి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ఓటమి పాలైన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు సన్‌రైజర్స్‌తో పోరు సవాల్‌గా మారనుంది.
రాజస్థాన్ బౌలింగ్‌ను ఆటాడుకున్న సన్‌రైజర్స్‌ను లఖ్‌నవూ బౌలర్లు అడ్డుకునేలా కనపడడం లేదు.
Details
బ్యాటింగ్ పోటీఇచ్చేందుకు సిద్ధమైన లఖ్‌నవూ
లఖ్‌నవూ బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ మినహా మిగిలినవారు పెద్దగా అనుభవం లేని బౌలర్లే.
బౌలింగ్ విభాగం బలహీనంగానే ఉన్నా, బ్యాటింగ్‌లో మాత్రం లఖ్‌నవూ పోటీ ఇవ్వగలదు.
మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, కెప్టెన్ రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, శార్దూల్ ఠాకూర్ వంటి బ్యాటర్లు లఖ్‌నవూ బలంగా నిలిచే అంశం.
ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూ తన బౌలింగ్‌లో మెరుగుదల చూపిస్తేనే సన్‌రైజర్స్‌కు గట్టి పోటీ ఇస్తుంది.
లేకపోతే హైదరాబాద్ మరోసారి భారీ స్కోరు చేసి 300 మార్క్ దిశగా దూసుకుపోయే అవకాశం కనిపిస్తోంది.