Page Loader
Suresh Raina-IPL: పార్టీ చేసుకునే జట్లు టైటిల్ ఎలా గెలుచుకుంటాయి?: సురేష్​ రైనా
ఒకప్పటి చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టులో ధోనీతో పాటు సురేష్​ రైనా ముచ్చట్లు

Suresh Raina-IPL: పార్టీ చేసుకునే జట్లు టైటిల్ ఎలా గెలుచుకుంటాయి?: సురేష్​ రైనా

వ్రాసిన వారు Stalin
Apr 22, 2024
06:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ టోర్నీ(IPL Tourney)టైటిల్(Title)గెలవని జట్లపై సురేష్ రైనా(Suresh Raina)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాత్రిళ్లు బాగా పొద్దుపోయే వరకు పార్టీలు చేసుకునే జట్లు ఐపీఎల్ టోర్నీలను ఎలా గెలుచుకుంటాయని క్రికెటర్ సురేష్ రైనా వ్యాఖ్యానించారు. ఐపీఎల్ లో కొన్ని జట్లు పార్టీలు ఇస్తుంటాయి . ఇప్పటివరకు రెండు మూడుజట్లే ఐపీఎల్ టైటిల్ ను గెలవలేకపోయాయి. చెన్నైసూపర్ కింగ్స్(Chennai Super kings)(CSK) ఐదుసార్లు, ముంబై ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్నాయి. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు, డెక్కన్ చార్జర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ ఒక్కోసారి ఐపీఎల్ టోర్నీని గెలవగా..కోల్ కతా నైట్ రైడర్స్ రెండుసార్లు ఐపీఎల్ కప్ ను ఎత్తుకుందని సురేష్ రైనా చెప్పారు.

Suresh Raina-Ipl

చెన్నై జట్టు ఎప్పుడూ పార్టీలు ఇవ్వలేదు: సురేష్​ రైనా

తనకు తెలిసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎప్పుడు పార్టీలు ఇవ్వలేదని సురేష్​ రైనా చెప్పుకొచ్చాడు. రాత్రిళ్లు బాగా పొద్దు పోయే వరకూ పార్టీలు చేసుకుంటే మరుసటి రోజు మ్యాచ్ ఆడటం ఎవరికైనా కష్టమేనని సురేష్ రైనా తెలిపాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న రాయల్స్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లెవన్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో సహా మూడేళ్ల క్రితం ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.