Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!
వన్డే వరల్డ్ కప్ 2023 ముగిసిన అనంతరం భారత జట్టు స్వదేశంలోనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. నవంబర్ 23 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే భారత జట్టుకు ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనే దానిపై ప్రస్తుతం క్రీడావర్గాల్లో ఆసక్తి నెలకొంది. హర్థిక్ పాండ్యా ప్రపంచ కప్ మధ్యలోనే వైదొలలగాడు. అతడు టీ20 సిరీస్‌కు కోలుకొనే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో టీ20 జట్టుకు ఎవరు నాయకత్వం ఎవరు వహిస్తారనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ మ్యాచుల టీ20 సిరీస్‌కు డాషింగ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నవంబర్ 23నుంచి టీ20 సిరీస్ ప్రారంభం
మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం అందించిన రుతురాజ్ గైక్వాడ్ కూడా కెప్టెన్ రేసులో ఉన్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు. ముఖ్యంగా ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్ 1 బ్యాటర్ గానూ కొనసాగుతున్నాడు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్ విశ్రాంతి తీసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ తదుపరి ఆప్షన్ గా ఉంటాడని తెలుస్తోంది. భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు ఇండియాలో జరగనుంది. ఈ సిరీస్ భాగంగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచులు జరగనున్నాయి.