
Champions League T20 : 2026లో తిరిగొస్తున్న టీ20 ఛాంపియన్స్ లీగ్.. ఐపీఎల్ జట్లు మళ్ళీ రంగంలోకి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ ఉధృతంగా జరుగుతున్నాయి. ఐపీఎల్ విజయాన్ని అనుసరించి, దాదాపు ప్రతి దేశం తమదైన లీగ్‌లను ప్రారంభించింది. అంతేకాదు ఇండియాలో ప్రతి రాష్ట్రం స్థాయి వద్ద కూడా తమ ప్లేయర్లను ప్రోత్సహించేందుకు టీ20 టోర్నీలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్స్ సంఖ్య ఇప్పుడు 25 దాటింది. ఒక్కప్పుడు వీటన్నింటికంటే ప్రత్యేకంగా టీ20 ఛాంపియన్స్ లీగ్ (CLT20) అనే ప్రతిష్టాత్మక టోర్నీ ఉండేది. ఈ లీగ్‌లో ఐపీఎల్, బిగ్‌బాష్, ఇంగ్లండ్ కౌంటీల టాప్ 2 జట్లు (విన్నర్స్, రన్నర్స్) మాత్రమే పోటీపడేవి. దేశవాళీ లీగ్స్‌లో అత్యుత్తమంగా ప్రదర్శించిన జట్లను ప్రపంచ వేదికపై ఒక్కదగ్గరికి తేచేసే ప్రయత్నమే అది.
Details
మళ్లీ పునఃప్రారంభమయ్యే అవకాశం
అయితే, విదేశీ టూర్ల గందరగోళం, ఐపీఎల్ డామినేషన్, స్పాన్సర్‌ల కొరత వంటి కారణాల వల్ల ఈ లీగ్ 2014 తర్వాత కొనసాగలేదు. తాజాగా టీ20 ఛాంపియన్స్ లీగ్ మళ్లీ పునఃప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి వరల్డ్ క్లబ్ టీ20 ఛాంపియన్‌షిప్ పేరిట ఈ టోర్నీని 2026 నుంచి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఐపీఎల్, బిగ్ బాష్, పాక్ సూపర్ లీగ్, ది హండ్రెడ్, SA20 లీగ్ వంటి ప్రఖ్యాత లీగ్స్‌లో టైటిల్ గెలిచిన జట్లు పాల్గొంటాయి. మొత్తం ప్రపంచంలోని టాప్ 20 లీగ్స్ విజేతలు ఇందులో తలపడతారని సమాచారం. ఈ లీగ్ ద్వారా దేశవాళీ టాలెంట్‌ను అంతర్జాతీయ వేదికపై మెరిపించే అవకాశం లభించనుంది.
Details
సానుకూలంగా స్పందించిన జైషా
ఈ అంశంపై ఇప్పటికే బీసీసీఐ, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ చైర్మన్ జై షా మధ్య చర్చలు జరిగాయి. జై షా కూడా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. లీగ్ గురించి ఇప్పటి వరకు వస్తున్న సిగ్నల్స్ అన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి. ఇక ఇదే సందర్భంలో ఇంగ్లాండ్ నుంచి హండ్రెడ్ లీగ్ ఛాంపియన్ జట్టునే ప్రతినిధిగా పంపాలని నిర్ణయించారు. గతంలో టీ20 బ్లాస్ట్ విజేతలు వెళ్తూ ఉండేవారు. ఇక ఐపీఎల్ 2025లో తొలిసారి ఆర్సీబీ ఛాంపియన్‌గా అవతరించింది.
Details
స్పాన్సర్ షిప్ లేకపోవడమే కారణం
తద్వారా వారు కూడా ఈ టోర్నీలో చోటు దక్కించుకోనున్నారు. ఇక గత చాంపియన్స్ లీగ్ విషయానికి వస్తే, అది 2009లో ప్రారంభమై 2014 వరకు జరిగింది. అయితే, 2015లో టీవీ రేటింగ్స్ పడిపోవడం, స్పాన్సర్‌షిప్ సమస్యలు వంటి కారణాలతో ఆ లీగ్‌ను నిలిపివేశారు. ఆ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్చె రో రెండు టైటిళ్లతో అత్యంత విజయవంతమైన జట్లుగా నిలిచాయి. 2026లో జరగనున్న ఈ వరల్డ్ క్లబ్ టీ20 లీగ్ మరింత ఉత్కంఠతకు, ఉల్లాసానికి వేదిక కావడం ఖాయం.