IND Vs AUS : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ వరల్డ్ కప్ భారత్ ఓటమి నిరాశతో ఉన్న అభిమానులకు మరో క్రేజీ న్యూస్ అందింది.
ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది.
గాయం కారణంగా హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది.
ఈ సిరీస్ నుంచి భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శుభమాన్ గిల్, జస్ప్రిత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ లకు విశ్రాంతి నిచ్చారు.
ఆస్ట్రేలియాతో నవంబర్ 23 నుంచి టీమిండియా ఐదు టీ20 మ్యాచులను ఆడనుంది.
Details
వైస్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్
ఇక ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
అయితే చివరి 2 మ్యాచ్‌లకు శ్రేయాస్ అయ్యర్ జట్టులో చేరనున్నాడని, వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని బీసీసీఐ తెలిపింది.
సంజు శాంసన్‌కు మరోసారి మొండిచేయ్యే ఎదురైంది.
ఆసియా కప్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ కప్‌లోనూ సెలెక్టర్లు సంజు శాంసన్‌ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే.
భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.