Indian Cricketers Phobia : టీమిండియా క్రికెటర్ల ఫోబియాలు- మనోళ్లకు అవంటే చచ్చేంత భయాలట!
మనుషుల్లో కొందరికి వివిధ రకాల ఫోబియాలు ఉంటాయి. ఈ భయాలు ఇతరులకు అనకోవచ్చు, కానీ అవి వారి మానసిక స్థితికి సంబంధించినవి. ఇక మన క్రికెటర్లకు కూడా కొన్ని ప్రత్యేకమైన ఫోబియాలు ఉన్నాయట. ఇండియా క్రికెట్ జట్టులో ఉన్న ప్రముఖ క్రికెటర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వంటి వారు కూడా కొన్నిరకాల భయాలను ఎదుర్కొంటారు. వాటిని గురించి తెలుసుకుందాం.
రోహిత్ శర్మ
కెప్టెన్ రోహిత్ శర్మకు చిన్నప్పటినుంచి నీళ్లలో మునగడమంటే అంటే చాలా భయం. అతను చెప్పినట్టుగా, నీళ్లలో డైవింగ్ చేస్తుండగా ఊపిరి బిగపట్టడం చాలా కష్టం అనిపిస్తుంది. అతనికి ఈ భయం చిన్నప్పటినుంచి ఉంది, కానీ ఈత నేర్చుకోవడం ద్వారా తన భయాన్ని అధిగమించడానికి ప్రయత్నించాడు. అయితే, నదులు, సముద్రాలలో నీళ్లలోకి వెళ్లడం మాత్రం అతనికి అసాధ్యం. కానీ సముద్రతీరంలో తిరగడం, ఇసుకలో పిచ్చుక గూళ్లు కట్టడం మాత్రం అతనికి చాలా ఇష్టం.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ విమానంలో ప్రయాణించే సమయంలో ఒకరకమైన భయం అనుభవిస్తాడు. విమానం ఎక్కిన తర్వాత టేకాఫ్ సమయంలో లేదా దిగేటప్పుడు, అలాగే టర్బులెన్స్ సమయంలో భయంకరమైన అనుభూతి ఉంటుందని చెబుతాడు. ఈ సమయంలో అతను సీటును గట్టిగా పట్టుకుంటాడు. విమానంలో ప్రయాణిస్తున్న ఇతరులు ధైర్యంగా ఉండటం కొద్దిగా ఆశ్చర్యకరంగా అనిపిస్తుందని కూడా అతను పేర్కొన్నాడు. కొన్నేళ్లుగా విమానంలో తిరుగుతున్నప్పటికీ ఆ ఫోబియా నుంచి బయట పడలేకపోతున్ననని తెలిపాడు.
హార్దిక్ పాండ్యా
హర్థిక్ పాండ్యాకు లిఫ్ట్‌లో ప్రయాణించటం అంటే చాలా భయం. ఎవరూ లేకుండా లిఫ్ట్‌లో ప్రయాణించడం అతనికి అసాధ్యం. లిఫ్ట్ ఆగిపోతే, లోపల ఇరుక్కుపోతే అతనికి కష్టంగా ఉంటుంది. కాబట్టి లిఫ్ట్ ప్రయాణం చేయడానికి తనతో ఎవరైనా ఉండాలని అనుకుంటాడు. అలాగే, ఇంజక్షన్ అంటే కూడా అతనికి భయం. ప్రాక్టీస్ సమయంలో గాయాలవ్వడం, సర్జరీలు చేయించుకోవడం వంటి పరిస్థితుల్లో, సూది చూశా కూడా అతనికి భయం కలుగుతుంది.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్‌కు ఒంటరిగా ఉండటం అంటే భయం. ఒంటరిగా ఉంటే ప్రతికూల ఆలోచనలు వస్తాయని, అందుకే ఎప్పుడూ తన చుట్టూ ఎవరో ఒకరు ఉండాలని చెప్పాడు. ఇలాంటి పరిస్థితులు అతనికి భార్య దేవిషా లేకపోతే ఎక్కువగా ఎదురవుతాయి. అయితే, ఈ భయాన్ని అధిగమించడానికి, అతను కుక్కలను పెంచడం ప్రారంభించాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోతే, అతను పాబ్లో మరియు ఓరియోతో ఆడుకోవడం ద్వారా సమయాన్ని సరదాగా గడుపుతాడు.
సంజు శాంసన్
సంజు శాంసన్‌కు కొంచెం చీకటిగానూ, కదలకుండా కట్టేసిన వాతావరణం అంటే భయం. ఆయనకు ఇలాంటి వాతావరణంలో ఊపిరి ఆడకుండా, చెమటలు పట్టేస్తాయని చెబుతాడు. సినిమా థియేటర్లలో, ఏసీ బస్సుల్లో, ట్రైన్లలో ఇలా ఉండే వాతావరణం కూడా అతనికి ఇబ్బంది కలిగిస్తుంది. అయితే, థియేటర్‌లో వినోదం వల్ల ఈ ఫోబియాను కొంతమేర దూరం చేసుకోగలిగినప్పటికీ, ప్రయాణ సమయంలో ఈ భయం ఎక్కువగా ఉంటుంది.