
IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనకు సిద్ధమైన టీమిండియా.. ఆగస్టు 17న తొలి వన్డే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ తర్వాత భారత్-బంగ్లాదేశ్ క్రికెట్ పర్యటనకు రంగం సిద్ధమైంది.
బీసీసీఐ తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, టీమిండియా ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనను ప్రారంభించనుంది. ఈ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఆగస్టు 17న ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మీర్పూర్ వేదికగా జరుగుతాయి. రెండవ వన్డే ఆగస్టు 20న నిర్వహించనుండగా, మూడవ వన్డే ఆగస్టు 23న చిట్టగాంగ్‌లో జరుగుతుంది.
తర్వాత టీ20 సిరీస్‌కు సంబంధించిన మ్యాచ్‌లు జరిగే తేదీలు కూడా ఖరారయ్యాయి. తొలి టీ20 ఆగస్టు 26న, రెండవది ఆగస్టు 29న, చివరిది ఆగస్టు 31న జరగనున్నాయి.
Details
జూన్ 20న టెస్టు సిరీస్
ఈ సిరీస్‌కు భారత జట్టు ఆగస్టు 13న ఢాకా చేరుకోనుంది.
అనంతరం సెప్టెంబర్ 1న జట్టు స్వదేశానికి తిరిగివచ్చే అవకాశం ఉంది.
ఈ పర్యటనకు ముందు భారత జట్టు ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఐదు టెస్ట్‌లతో కూడిన ఈ సిరీస్ జూన్ 20న ప్రారంభమవుతుంది.
తొలి టెస్ట్ లీడ్స్ వేదికగా జరగనుండగా, రెండవది జూలై 2న బర్మింగ్‌హామ్, మూడవ టెస్ట్ జూలై 10న లార్డ్స్, నాలుగో టెస్ట్ జూలై 23న మాంచెస్టర్, ఐదో టెస్ట్ జులై 31న ఓవల్ వేదికగా జరగనుంది.
ఈ రెండు సిరీస్‌లు టీమిండియాకు కీలకంగా మారనున్నాయి.
టెస్ట్ మైదానంలో సత్తా చాటిన అనంతరం వన్డే, టీ20లలో కూడా జట్టు మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.