Page Loader
చివరి వన్డేలో టీమిండియా ఓటమి.. నాలుగు వికెట్లతో చెలరేగిన మాక్స్‌వెల్
చివరి వన్డేలో టీమిండియా ఓటమి.. నాలుగు వికెట్లతో చెలరేగిన మాక్స్‌వెల్

చివరి వన్డేలో టీమిండియా ఓటమి.. నాలుగు వికెట్లతో చెలరేగిన మాక్స్‌వెల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2023
09:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరిగి మూడో వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ టీమిండియాకు భారీ టార్గెట్ ఇచ్చింది. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లకు 286 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ(81), విరాట్ కోహ్లీ (56), శ్రేయస్ అయ్యర్(48) రాణించినా.. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో మాక్స్ వెల్ 4, హేజిల్ వుడ్ 2, స్టార్క్, కమిన్స్, గ్రీన్ తలా ఓ వికెట్ తీశారు. మొదటి రెండు వన్డేలకు గెలిచిన భారత్ మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

66 పరుగుల తేడాతో భారత్ ఓటమి