
World Cup 2023 : టీమిండియాకు దెబ్బ.. రెండో మ్యాచ్‌కూ స్టార్ బ్యాటర్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం తలపడ్డ భారత్, భారీ విజయం సాధించి నూతనోత్సాహంతో తొణికిసలాడుతోంది.
అయితే తొలి మ్యాచుకి అనారోగ్యం కారణంగా అందుబాటులో లేని టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ రెండో మ్యాచులోనూ ఆడటం లేదు.
ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడు జట్టుతో పాటు దిల్లీ వెళ్లట్లేదని, చెన్నైలోనే ఉంటాడని పేర్కొంది.
శుభ్‌మన్ గిల్ డెంగ్యూ బారినపడ్డాడని, కోలుకునేందుకు మరో వారం నుంచి 10 రోజులు పడుతుందని సమాచారం. శనివారం పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి అందుబాటులోకి రానున్నారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండు పరుగులకే 3 కీలక వికెట్లు పడ్డాయి. ఈనెల11న, భారత్. అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రేపటి మ్యాచుకు స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ దూరం
🚨 Medical Update: Shubman Gill 🚨
— BCCI (@BCCI) October 9, 2023
More Details 🔽 #TeamIndia | #CWC23 | #MeninBluehttps://t.co/qbzHChSMnm