పాక్ తో మ్యాచ్ ముంగిట టీమిండియాకు షాక్.. ఆస్పత్రి పాలైన శుభ్‌మన్ గిల్
భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ మేరకు ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌లో బుధవారం ఆఫ్ఘనిస్థాన్ తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి రాలేదు. అయితే పాకిస్థాన్ తో మ్యాచ్ వరకు ఎలాగైనా కోలుకుంటాడని భావించింది బీసీసీఐ. కానీ ఆ మ్యాచుకూ శుభ్‌మన్ గిల్ అందుబాటులోకి రాలేడని తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ ధృవీకరించింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ కోసం టీమిండియా దిల్లీకి వెళ్లే ముందు గిల్ ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోయాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గిల్ ను ముందు జాగ్రత్త చర్యగా ఆస్పత్రిలో చేర్చారు. బీసీసీఐ వైద్య బృందం నిత్యం గిల్ ను పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది.
ఆఫ్ఘన్ మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశం
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ముందు డెంగ్యూ బారిన పడ్డ శుభ్‌మన్ గిల్ తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం భారత్ రెండో మ్యాచ్ కు అందుబాటులో లేకుండా పోయాడు. అయితే ఇది అక్కడితో ఆగకుండా దయాది పాక్ తో జరిగే కీలక పోరులోనూ గిల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు శుభ్‌మన్ గిల్ దూరంగానే ఉంటాడని బీసీసీఐ ఇప్పటికే నిర్థారించింది. ఈ మేరకు సోమవారమే అధికారిక ప్రకటన చేసింది. శుభ్ మన్ గిల్ గైర్హాజరులో ఆస్ట్రేలియాపై కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇటు ఆఫ్ఘన్ మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి.