Page Loader
Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే  మూడు రెట్లు! 
టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే మూడు రెట్లు!

Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్‌మనీ కంటే  మూడు రెట్లు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 20, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)ను గెలుచుకొని విజేతగా నిలిచింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ విజయానికి గుర్తింపుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానాను ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. జట్టు సభ్యులకు మొత్తం రూ.58 కోట్ల నగదు బహుమతిగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

వివరాలు 

వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న భారత ఆటగాళ్లు 

''రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టోర్నీ మొత్తం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.ఓటమి లేకుండా ట్రోఫీని గెలుచుకోవడం గర్వకారణం.బంగ్లాదేశ్‌పై ఘన విజయంతో టోర్నీని ప్రారంభించిన భారత్,పాకిస్థాన్‌,న్యూజిలాండ్‌లను కూడా పరాజయపరిచింది.అనంతరం సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరుకుని, అక్కడ న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న భారత ఆటగాళ్ల ప్రతిభను బోర్డు గుర్తించకుండా ఉండదు. వారి కృషికి పురస్కారంగా ఈ నగదు బహుమతిని అందిస్తున్నాం. జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఈ నజరానా ప్రకటించడం సంతోషంగా ఉంది. వారంతా దీనికి అర్హులే. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు ఎవరూ చేరనంత ఎత్తుకు ఎదుగుతోంది,'' అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.

వివరాలు 

రెండో ఐసీసీ టైటిల్‌

విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు ఐసీసీ నుంచి రూ.19.50 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. ఫైనల్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్‌కు రూ.9.70 కోట్ల వరకు లభించాయి. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ వరుసగా ఒకే సంవత్సరంలో రెండో ఐసీసీ టైటిల్‌ను గెలుచుకోవడం విశేషం.