Rohit Sharma: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్.. రోహిత్ కెప్టెన్సీపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుత విజయాలు నమోదు చేశాడు.
అతని నాయకత్వంలో భారత జట్టు వరుసగా టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీను గెలుచుకుంది.
అంతకుముందు వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు కూడా జట్టును చేర్చాడు. అయితే,టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అంతగా రాణించలేకపోయింది.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లు కోల్పోయి, మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
దీంతో రోహిత్ శర్మ టెస్టు కెరీర్‌తో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది.
రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడే అవకాశముందని తెలుస్తోంది. కొత్త డబ్ల్యూటీసీ సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుండటంతో, టెస్టు కెప్టెన్సీ విషయంలో అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి.
Details
ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో రోహిత్?
జూన్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ, సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు సమాచారం.
సుదీర్ఘ ఫార్మాట్‌లో రోహిత్ ఫామ్ ఊహించిన స్థాయిలో లేకపోయినప్పటికీ, అతని నాయకత్వ నైపుణ్యంపై బోర్డు పూర్తిగా విశ్వాసం ఉంచినట్లు తెలుస్తోంది.
"రోహిత్ శర్మ జట్టును విజయపథంలో నడిపించగలడు. అందుకే అతడే సరైన ఎంపిక అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
Details
రోహిత్ శర్మ గొప్ప నాయకుడు: దినేశ్ కార్తిక్
రోహిత్ శర్మ భారత క్రికెట్‌లో అత్యుత్తమ నాయకుల్లో ఒకడు. అతడు గొప్ప లెగసీని మిగిల్చి వెళ్తాడు. ధోనీ, కపిల్ దేవ్ తరహాలో రోహిత్ కూడా మార్పును తీసుకొచ్చాడు.
వ్యక్తిగతంగా కూడా అతను చమత్కారపరుడే. రిటైర్మెంట్ గురించి అతను స్పందించిన విధానం దీనికి ఉదాహరణ అని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ వ్యాఖ్యానించాడు.
ఇక టెస్టు క్రికెట్‌లో రోహిత్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి. బీసీసీఐ అతడిని మరికొంతకాలం కెప్టెన్‌గా కొనసాగిస్తుందా లేదా కొత్త నాయకుడిని ఎంపిక చేస్తుందా అన్నది త్వరలోనే స్పష్టమవుతుంది.