తదుపరి వార్తా కథనం
IND vs AUS: సిడ్నీ టెస్టులో ఆసీస్ జట్టు 181 పరుగులకే ఆలౌట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 04, 2025
09:42 am
ఈ వార్తాకథనం ఏంటి
సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో ఆసీస్ జట్టు 181 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేయగా, ఆసీస్ 4 పరుగుల వెనుకంజలో ఉంది.
భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ మరియు మహ్మద్ సిరాజ్ తలా 3 వికెట్లు తీసి చక్కటి ప్రదర్శన కనబరిచారు. జస్‌ప్రీత్ బుమ్రా , నితీష్ కుమార్ రెడ్డి తలా 2 వికెట్లు తీసి తమ సహకారాన్ని అందించారు.
ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో డెబ్యుటెంట్ వెబ్ స్టర్ 57 పరుగులు చేసి రాణించగా, స్మిత్ 33 పరుగులతో కొంత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.
ఇవాళ ఇంకా 40 ఓవర్లు ఆట జరగే అవకాశం ఉంది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయి.