England team: పాయింట్ల పట్టికలో అట్టగుడున డిఫెండింగ్ ఛాంపియన్.. ఇంగ్లండ్ సెమీస్ ఆశలు నెరవేరేనా..?
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా డిఫెడింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అడుగుపెట్టింది.
2019లో టైటిల్ నెగ్గిన ఆ టీమ్.. ఈ సారి మాత్రం దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది.
అంచనాలను ఆ జట్టు ఏ మాత్రం అందుకోలేకపోతోంది. ఇప్పటివరకూ ప్రపంచ కప్ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచుల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే నెగ్గింది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఇంగ్లండ్ ఘోరంగా చతికిలపడింది.
ప్రస్తుతం సెమీస్ చేరే అవకాశాలు అత్యంత సంక్లిష్టం చేసుకుంది.
ఇక మిగిలిన ఐదు మ్యాచులు గెలిచినా, ఇతర జట్ల సమీకరణాలపై ఆ జట్టు సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
Details
నేడు శ్రీలంకతో తలపడనున్న ఇంగ్లండ్
టోర్నీలో మొదట న్యూజిలాండ్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లండ్, ఆ తర్వాత ఆఫ్గానిస్తాన్ తో 69 పరుగులతో,సౌతాఫ్రికాతో 229 పరుగులతో తేడాతో ఆ జట్టు ఓటమిపాలైంది.
ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టుకు బౌలింగ్ అతిపెద్ద సమస్యగా మారింది. క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, సామ్ కరన్ సహా మిగిలిన బౌలర్లు కూడా రాణించలేకపోతున్నారు.
ఇప్పటివరకూ జరిగిన నాలుగు మ్యాచుల్లో ఏకంగా ఇంగ్లండ్ 1,193 పరుగులను సమర్పించుకుంది.
ఇక ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఫిట్‌నెస్ లేక ఈ టోర్నీలో తొలి మూడు మ్యాచుల్లో ఆడలేదు. దక్షిణాఫ్రికాతో మ్యాచులో స్టోక్స్ ఆడినా, పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
చైన్నైచెపాక్ వేదికగా జరిగే ఇవాళ శ్రీలంకతో ఇంగ్లండ్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది.