
వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠంగా సాగిన మ్యాచులివే
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 భారత్ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ఇండియాకు చేరుకున్నాయి.
ఈ టోర్నీ మొదటి మ్యాచులో 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
అయితే ఈ రెండు జట్ల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఉత్కంఠంగా సాగిన మ్యాచుల గురించి తెలుసుకుందాం.
లార్డ్స్ జరిగిన 2019 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఇంగ్లండ్ ఓడించింది. బెన్ స్టోక్స్ (84*), జోస్ బట్లర్ (59) రాణించగా, మ్యాచ్ టై అయింది.
అయితే ఈ రెండు జట్ల సూపర్ ఓవర్ జరగ్గా, అది కూడా టై కావడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ జట్టును విజేతను ప్రకటించారు.
Details
వన్డే వరల్డ్ కప్ చరిత్రలో వేగవంతమైన హాఫ్ సెంచరీతో మెకల్లమ్ రికార్డు
వెల్లింగ్టన్‌లో జరిగిన 2015 వన్డే వరల్డ్ కప్ పోరులో కివీస్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయింది.
మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్‌ను 123 పరుగులకే కివీస్ జట్టు కట్టడి చేసింది. టిమ్ సౌథీ కెరీర్-బెస్ట్ 7 వికెట్లతో ఇంగ్లండ్ బ్యాటర్ల నడ్డి విరిచాడు.
ఈ మ్యాచులో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 18 బంతుల్లో వన్డే వరల్డ్ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హఫ్ సెంచరీని నమోదు చేశాడు.
కేవలం 25 బంతుల్లో 77 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది.
Details
1996లో ఇంగ్లండ్ ను ఓడించిన న్యూజిలాండ్
1996 అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించింది.
ఓపెనర్ నాథన్ ఆస్టిల్ (101) అద్భుత శతకంతో కివీస్ 236/6 స్కోరు చేసింది.
ఆ తర్వాత లక్ష్య చేధనలో గ్రేమ్ హీక్ 85 పరుగులతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇంగ్లండ్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
1979 మాంచెస్టర్‌లో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తలపడ్డాయి.
ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన 60 ఓవర్లో 221/8 స్కోరు చేసింది. మైక్ బ్రేర్లీ (53), గ్రాహం గూచ్ (71) అర్ధ సెంచరీలతో చెలరేగారు.
లక్ష్య చేధనలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడ్డారు. జాన్ రైట్ (69) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
దీంతో ఇంగ్లండ్ తొమ్మిది పరుగుల తేడాతో విజయం సాధించింది.