బీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, రేపటి నుంచి వెస్టిండీస్ జట్టుతో వన్డే సిరీస్‌ను ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లకు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది.
భారత ఆటగాళ్లు సరైన నిద్ర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. వెస్టిండీస్‌తో తొలి వన్డే ఆడేందుకు ఆటగాళ్లు ట్రినిడాడ్ నుంచి బార్బడోస్ కు టీమిండియా ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నారు.
అయితే రాత్రి 11 గంటలకు రావాల్సిన విమానం దాదాపు 4 గంటల ఆలస్యంగా వచ్చిందే. తెల్లవారుజామున 3 గంటలకు విమానం రావడంతో టీమిండియా ఆటగాళ్లు అసౌకర్యానికి గురైనట్లు సమాచారం.
Details
బీసీసీఐకి లేఖను రాసిన జట్టు మేనేజ్‌మెంట్
టెస్టు సిరీస్, వన్డే సిరీస్‌కు మధ్య సరైన నిద్ర లేకపోవడంతో భారత ప్లేయర్లకు ఇబ్బందిగా మారిందట.
ఈ ఆసౌకర్యంపై బీసీసీఐకి జట్టు మేనేజ్‌మెంట్ లేఖ రాసింది. ఈ ప్రయాణంతో ఒక రోజంతా ఆటగాళ్లకు నిద్ర లేదని, దీంతో శిక్షణకు ఇబ్బంది ఏర్పడిందని రాశారట.
రాత్రి ప్రయణాలు కాకుండా, కేవలం పగటిపూట మాత్రమే ఉండాలని లేఖలో కోరినట్లు సమాచారం.
ఈ మేరకు బీసీసీఐ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇకపై భారత ఆటగాళ్లకు ఇలాంటి ఆసౌకర్యాలు జరగకుండా చూసుకుంటామని బీసీసీఐ హామీ ఇచ్చిందట.