
AUS vs WI: మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్.. ఆసీస్ చేతిలో విండీస్ ఘోర పరాభవం
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా (Australia) జట్టు 159 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. కెన్‌సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో 301 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ కేవలం 141 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా విజయంలో పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను 5 వికెట్లు తీసి విండీస్‌ను బెంబేలెత్తించాడు.
Details
రాణించిన ఆసీస్ బ్యాటర్లు
ప్రత్యర్థి జట్టు మొత్తం 33.4 ఓవర్లపాటు మాత్రమే నిలువగలిగింది. మూడో రోజు ఆట ముగిసిన తర్వాత మ్యాచ్ ఫలితం వెలువడే అవకాశముండటంతో అధికారులు అదనంగా గంటా 13 నిమిషాలపాటు ఆట కొనసాగించారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్, మాథ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ క్యారీలు అద్భుతంగా రాణించారు. ముగ్గురూ అర్ధ సెంచరీలతో స్కోరుబోర్డును దూసుకుపోయారు. వారి బ్యాటింగ్ ఆధారంగా ఆసీస్ మంచి స్కోరు చేసి, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది