Page Loader
James Anderson: ఇంగ్లండ్‌ వెట‌ర‌న్ పేస్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. భారత్‌లో టెస్టు ఆడిన అతి పెద్ద వయస్కుడిగా..
James Anderson: ఇంగ్లండ్‌ వెట‌ర‌న్ పేస్‌ బౌలర్‌ అరుదైన రికార్డు

James Anderson: ఇంగ్లండ్‌ వెట‌ర‌న్ పేస్‌ బౌలర్‌ అరుదైన రికార్డు.. భారత్‌లో టెస్టు ఆడిన అతి పెద్ద వయస్కుడిగా..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 02, 2024
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌ వెట‌ర‌న్ పేస్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ శుక్రవారం విశాఖ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచు ఆడ‌డం ద్వారా చ‌రిత్ర సృష్టించాడు. భారత్ లో జరిగిన టెస్టు మ్యాచుల్లో అత్య‌ధిక వ‌య‌సులో మ్యాచ్ ఆడిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. విశాఖపట్టణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అండర్సన్ 41ఏళ్ల 187రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. 72ఏళ్ల పాటు టెస్టు క్రికెట్‌లో కొనసాగిన సుదీర్ఘ రికార్డును అండర్సన్ బద్దలు కొట్టాడు.అండర్సన్‌ కంటే ముందు భారత క్రికెట్‌ దిగ్గజం లాలా అమర్‌నాథ్ పేరిట ఈరికార్డు ఉండేది. 1952లో 41ఏళ్ల 92రోజుల వ‌య‌సులో లాలా అమ‌ర్‌నాథ్ భార‌త గ‌డ్డ పై పాకిస్తాన్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

Details 

అండ‌ర్స‌న్ ఖాతాలో మ‌రో రికార్డు

ఆండర్సన్ ,అమర్‌నాథ్‌లతో పాటు, ఈ జాబితాలో రే లిండ్‌వాల్(38 ఏళ్ల 112 రోజులు), షూటే బెన‌ర్జీ (37 ఏళ్ల 124 రోజులు), గులామ్ గార్డ్‌(34 ఏళ్ల 20 రోజులు) లు ఉన్నారు. అండర్సన్ భారత్‌లో టెస్టు ఆడిన ఐదవ వయస్కుడైన ఆటగాడిగా కూడా నిలిచాడు. జింబాబ్వే ఆటగాడు జాన్ ట్రైకోస్ 1993లో 45 ఏళ్ల 304 రోజుల వయసులో ఆడి రికార్డు సృష్టించాడు. అండ‌ర్స‌న్ ఖాతాలో మ‌రో రికార్డు వ‌చ్చి చేరింది. అత్య‌ధిక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో టెస్టులు ఆడిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. అండ‌ర్స‌న్ కంటే ముందు వెస్టిండీస్ ఆటగాడు శివ‌న‌రైన్ చంద్ర‌పాల్‌ రెండో స్థానంలో నిలిచారు. వీరిద్ద‌రు 22 క్యాలెండ‌ర్ ఇయ‌ర్స్‌లో టెస్టులు ఆడారు.

Details 

తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇండియా 336 ప‌రుగులు

ఈ జాబితాలో స‌చిన్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు.స‌చిన్ 25 క్యాలెండ‌ర్ ఇయ‌ర్స్‌లో టెస్టులు ఆడాడు. అండ‌ర్స‌న్ 14టెస్టు మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 35వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే..తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆరు వికెట్లు న‌ష్ట‌పోయి 336 ప‌రుగులు చేసింది. యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (179)భారీ శ‌త‌కంచెయ్యగా... అత‌డికి తోడుగా ర‌విచంద్ర‌న్ అశ్విన్ (5) క్రీజులో ఉన్నాడు. శుభ్‌మ‌న్ గిల్ (34),ర‌జ‌త్ పాటిదార్ (32),శ్రేయ‌స్ అయ్య‌ర్ (27),అక్ష‌ర్ ప‌టేల్ (27) లు ఫ‌ర్వాలేద‌నిపించ‌గా రోహిత్ శ‌ర్మ (14) విప‌లం అయ్యాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో షోయ‌బ్ బ‌షీర్, రెహాన్ అహ్మ‌ద్ లు చెరో రెండు వికెట్లు పడ‌గొట్ట‌గా జేమ్స్ అండ‌ర్స‌న్‌, టామ్ హ‌ర్ట్లీ లు తలా ఓ వికెట్ తీశారు.