IND vs PAK: పాక్‌పై 60 బంతుల్లోనే సెంచరీ సత్తా ఆ ప్లేయర్‌కి ఉంది: యువరాజ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
కొద్దిసేపు ఓపిక పట్టగలిగితే, పాకిస్థాన్‌పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 60 బంతుల్లోనే సెంచరీ బాదేస్తాడని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం దుబాయ్ వేదికగా భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ దూకుడుగా ఆడిన సంగతి తెలిసిందే. అదే తరహా ఆటను మరోసారి కనబరిచేలా రోహిత్‌కు యూవీ సూచనలు ఇచ్చాడు.
Details
రోహిత్ ధాటికి బౌండరీల మోత
రోహిత్ శర్మ తన ఫామ్‌ను కొనసాగిస్తే, కేవలం 60 బంతుల్లో సెంచరీ సాధించడం ఖాయమన్నారు. ఒక్కసారి సెటిల్ అయ్యాక, ఫోర్లతోపాటు సిక్సర్లతో పరుగుల వరద పారిస్తారని చెప్పారు.
షార్ట్ పిచ్ బంతులను చక్కగా ఎదుర్కొనే రోహిత్, 145-150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను హుక్ చేసి అలవోకగా బౌండరీలుగా మలచగలడని ప్రశంసించారు.
ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలిగే ప్లేయర్ రోహిత్ అని యువరాజ్ వ్యాఖ్యానించాడు.
Details
ఫామ్‌తో సంబంధం లేదు
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఫామ్ అనేది లెక్కలోకి రావాల్సిన అంశమే కాదన్నారు.
వన్డేల్లో వారిద్దరూ మ్యాచ్ విన్నర్లు అని, ప్రస్తుతం రోహిత్ కొంత ఇబ్బందిపడుతున్నా పరుగులు సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు.
కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు మరింత ప్రమాదకరంగా మారతాడని యువీ తెలిపాడు.
Details
వారిద్దరిని ఔట్ చేయడమే కీలకం - ఇంజమామ్
ప్రస్తుతం భారత జట్టులోని ప్రతి క్రికెటరూ అద్భుతమైన ఆటగాళ్లే అని, అందులోనూ విరాట్, రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఇంజమామ్ చెప్పారు.
రెండు దశాబ్దాలుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఒకవేళ వారిద్దరూ త్వరగా ఔటయితే, భారత డ్రెస్సింగ్ రూమ్‌లో ఒత్తిడి పెరుగుతుందన్నారు.
అలాగే పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ ఔటైనా తమ జట్టులో ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. రోహిత్, విరాట్‌ను తొందరగా పెవిలియన్ పంపగలిగితేనే పాకిస్థాన్‌కు కలిసొచ్చే పరిస్థితి అని ఇంజమామ్ ఉల్ హక్ వ్యాఖ్యానించాడు.