
IND vs SA : కేప్‌టౌన్ టెస్టులో బద్దలైన రికార్డులివే.. ధోని సరసన రోహిత్ శర్మ నిలుస్తాడా?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్‌టౌన్ వేదికగా జరిగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది.
ఈ పిచ్ పేస్ బౌలింగ్‌కు అరకూలించడంతో తొలిరోజే మొత్తం 23 వికెట్లు పడ్డాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకి ఆది నుంచే ఎదురు దెబ్బలు తగిలాయి.
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు.
సిరాజ్ ఆరు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది.
ఇక తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 153 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఫర్వాలేదనిపించింది.
అయితే ఆ తర్వాత ఒక్క పరుగు చేయకుండానే మిగిలిన బ్యాటర్లు పెవిలియానికి చేరడం గమనార్హం.
Details
సౌతాఫ్రికా టెస్టు సిరీస్ డ్రా చేసుకున్న ఏకైక కెప్టెన్ ధోని
తొలి రోజే 23 వికెట్లు పడడం 122 ఏళ్లలో ఇదే తొలిసారి. 1902 ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచులో తొలిరోజే 25 వికెట్లు పడ్డాయి.
153 పరుగుల వద్ద భారత్ ఒక్క పరుగు చేయకుండా ఆరు వికెట్లు కోల్పోయింది.
ఇలా ఒకే స్కోరు వద్ద టెస్టుల్లో ఏ జట్టూ ఆరు వికెట్లను కోల్పోలేదు.
గతంలో టీమిండియా, సౌతాఫ్రికా మధ్య ఎనిమిది టెస్టు సిరీస్ లు జరిగాయి. ఇందులో ఏడింట్లో సౌతాఫ్రికా గెలుపొందింది.
ఒక్క సిరీస్ మాత్రమే డ్రాగా ముగిసింది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ డ్రా చేసుకున్న ఏకైక భారత కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రమే.
ఇక ఎంఎస్ ధోని సరసన రోహిత్ శర్మ చేరుతాడో లేదో వేచి చూడాలి.