Page Loader
ICC: గత ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా సాధించిన అదిరిపోయే రికార్డులివే! 
గత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా సాధించిన అదిరిపోయే రికార్డులివే!

ICC: గత ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా సాధించిన అదిరిపోయే రికార్డులివే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2023
10:23 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈసారీ వన్డే వరల్డ్ కప్ మెగా టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తోంది. ఆక్టోబర్ 5 నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఆస్ట్రేలియా జట్టుకు పేరుంది. ప్రస్తుతం వారు ఆరో టైటిల్ ను గెలుపొందడానికి ఇప్పటికే సన్నాహాలను పూర్తి చేశారు. ఆస్ట్రేలియా ప్రపంచ కప్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు ట్రోఫీని గెలుచుకున్న జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. 1987, 1999, 2003, 2007, 2015లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచి ప్రపంచ రికార్డును సాధించింది. దీంతో వరుసగా మూడుసార్లు ప్రపంచకప్ టైటిల్స్ సాధించిన ఏకైక జట్టుగా ఆస్ట్రేలియా జట్టు రికార్డుకెక్కింది.

Details

ఆస్ట్రేలియా

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయాల శాతం (74.73)గా ఉంది. వాస్తవానికి 70శాతం కంటే ఎక్కువ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా మొదటిస్థానంలో నిలిచింది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా 94 మ్యాచులను ఆడింది. ఇందులో 69 మ్యాచుల్లో విజయాన్ని నమోదు చేయగా, కేవలం 23 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయారు. 2015 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 417/6 స్కోర్ చేసింది. ఇప్పటి వరకు 50 ఓవర్ల టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వన్డే ప్రపంచకప్‌లో 68 వికెట్లు తీసి రికార్డుకెక్కాడు. 2007 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంకపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అత్యధికంగా 149 పరుగులు చేశాడు.