Yashasvi Jaiswal: మూడు క్యాచ్‌లు నేలపాలు.. జైస్వాల్ ఫీల్డింగ్‌పై రోహిత్ అసహనం
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్‌లో క్యాచ్‌లు మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసే కీలక అంశాలుగా నిలుస్తాయి. ఈ నిజాన్ని పొట్టి ప్రపంచకప్ ఫైనల్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రపంచానికి స్పష్టంగా చూపించాడు.
అయితే భారత యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ఈ విషయాన్ని మరచిపోయినట్లు కనిపిస్తున్నాడు. అతడు మూడు కీలక క్యాచ్‌లను వదిలేసి, కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన తర్వాత ఉస్మాన్ ఖవాజా కోసం గల్లీలో జైస్వాల్‌ను ఫీల్డింగ్‌కు నియమించారు. బుమ్రా వేసిన బంతిని ఖవాజా ఫ్లిక్ చేసి గల్లీ దిశగా కొట్టాడు.
కానీ జైస్వాల్ ఆ క్యాచ్‌ను పడేసాడు. అప్పటికి ఆసీస్ ఇన్నింగ్స్ కేవలం మూడు ఓవర్లే పూర్తయ్యాయి.
Details
లబుషేన్ క్యాచ్ డ్రా చేసిన జైస్వాల్
ఈ క్యాచ్ డ్రాప్ చూసి బుమ్రా ఆశ్చర్యపోయాడు. అనంతరం 40వ ఓవర్లో, ఆకాశ్‌దీప్ వేసిన లెంగ్త్ బాల్‌ను లబుషేన్ బ్యాట్ ఫేస్‌ను ఓపెన్ చేసి ఆడే ప్రయత్నంలో, గల్లీ దిశగా పంపాడు.
అయితే జైస్వాల్ ఆ క్యాచ్‌ను కూడా వదిలేశాడు. ఆ సమయంలో లబుషేన్ అర్ధశతకం పూర్తి చేయలేదు, కానీ మ్యాచ్‌లో 70 పరుగులు చేశాడు.
ఇంకా ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు, సిల్లీ పాయింట్‌లో ఇచ్చిన క్యాచ్‌ను కూడా జైస్వాల్ చేజార్చాడు. ఈ సమయంలో రోహిత్ శర్మ తన అసహనాన్ని తట్టుకోలేకపోయాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో కూడా జైస్వాల్ సిల్లీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తూ, బ్యాటర్ స్టీవ్ స్మిత్ బంతి ఆడక ముందే గాల్లోకి ఎగిరాడు.
Details
జైస్వాల్ కు మద్దతు పలికిన మైక్ హస్సీ
ఇది గమనించిన రోహిత్ శర్మ అరే జస్సూ... గల్లీ క్రికెట్ ఆడుతున్నావా? బాల్ ఆడేదాకా కిందే ఉండు అంటూ సీరియస్‌గా చెప్పాల్సి వచ్చింది.
ఈ మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించాయి. అనంతరం ఆసీస్ మాజీ బ్యాటర్, ఫాక్స్ క్రికెట్ వ్యాఖ్యాత మైక్ హస్సీ స్పందించారు. క్యాచ్‌లు ఎవరూ కావాలని వదలరని, ఇప్పటికే జైస్వాల్ సిగ్గుపడుతున్నారని, ఈ సమయంలో అతడిని ఆత్మస్థైర్యం కలిగించాలన్నారు.
ముఖ్యంగా కెప్టెన్ ప్రోత్సహించే విధంగా వ్యవహరించాలన్నారు. నాయకుడి స్పందన జట్టును ఒత్తిడి నుంచి బయటకు తీసుకొచ్చేలా ఉండాలి కానీ, ఇంకా ఒత్తిడి పెంచేలా కాదంటూ జైస్వాల్‌కు మద్దతు తెలిపాడు.