
Hardik Pandya - Tilak Varma: తిలక్ వర్మ 'రిటైర్డ్ ఔట్'.. పాండ్య సమాధానం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ చరిత్రలో రిటైర్ ఔట్ అయిన నాలుగో బ్యాటర్‌గా ముంబయి ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ నిలిచాడు.
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ 23 బంతుల్లో కేవలం 24 పరుగులే చేశాడు. పరుగుల వేగాన్ని పెంచడంలో విఫలమవడంతో, జట్టుకు అవసరమైన హిట్టింగ్ అందించలేకపోయాడు.
దాంతో ముంబయి మేనేజ్‌మెంట్ అతడిని రిటైర్ ఔట్ చేసి, మిచెల్ సాంట్నర్‌ను బరిలోకి పంపించింది.
ఆ సమయంలో విజయానికి ముంబయికి 7 బంతుల్లో 24 పరుగులు అవసరం కాగా, చివరికి జట్టు 191 పరుగులకే పరిమితమై 12 పరుగుల తేడాతో ఓటమి చెందింది.
Details
15 పరుగులు అదనంగా ఇచ్చాం
తిలక్ వర్మ రిటైర్ ఔట్‌పై ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పందిస్తూ, ''ఇలాంటివి క్రికెట్‌లో అప్పుడప్పుడూ జరుగుతుంటాయి.
ఆ సమయంలో శీఘ్రంగా పరుగులు తీయాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించవు. ఈ మ్యాచ్‌లోనూ మా బ్యాటింగ్ యూనిట్ నిరాశ పరిచింది.
గెలుపు ఓటములు జట్టుగా వస్తాయి. ఇక్కడ ఎవరినీ వ్యక్తిగతంగా బాధ్యతవహించమని చెప్పలేం.
పరాజయానికి మొత్తం జట్టే బాధ్యత వహించాలి. కెప్టెన్‌గా బాధ్యత నాదే. మేం కనీసం 15 పరుగులు అదనంగా ఇచ్చామని అర్థమవుతోందని పేర్కొన్నారు.
Details
డాట్ బాల్స్ వేయడంపైనే దృష్టి
తన ఐదు వికెట్ల ప్రదర్శన గురించి హార్దిక్ మాట్లాడుతూ, ''నా బౌలింగ్‌ను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. వికెట్లు పడగొట్టే ఉద్దేశంతో కాకుండా, డాట్ బాల్స్ వేయడంపైనే దృష్టి పెడతాను.
పిచ్‌ను అర్థం చేసుకొని సమర్థంగా బౌలింగ్ చేయడమే లక్ష్యం. డాట్ బాల్స్ వల్ల ప్రత్యర్థి రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ టోర్నమెంట్ పెద్దది. మళ్లీ గెలుపుతో లయలోకి వచ్చేస్తామని వివరించారు.