Tilak Varma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో తిలక్ వర్మ ఘనత.. ఏకంగా 69 స్థానాలు ఎగబాకి టాప్-3లోకి ఎంట్రీ
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఏకంగా ఏకంగా 69 స్థానాలు ఎగబాకి మూడోస్థానికి చేరుకున్నాడు. టీ20 ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా టాప్-10లోకి తిలక్ వర్మ అడుగుపెట్టాడు. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో ఉండగా, ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో ఉన్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో తిలక్ తన అద్భుత ప్రదర్శనతో ఈ స్థాయికి చేరుకున్నాడు. తిలక్ వర్మ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 198 స్ట్రైక్‌రేట్‌తో 280 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రెండు మ్యాచ్‌లలో శతకాలు బాది, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు.
ఆల్ రౌండర్ విభాగంలో హార్ధిక్ పాండ్యా నెంబర్ వన్
ఇక సఫారీలపై రెండు శతకాలు చేసిన సంజు శాంసన్ తన ర్యాంకింగ్స్‌లో 17 స్థానాలను మెరుగుపరుచుకుని 22వ స్థానంలో నిలిచాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో మూడు శతకాలు సాధించిన సంజు, టీ20 ఫార్మాట్‌లో తన స్థాయిని మరింత బలపరుచుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా రుతురాజ్ గైక్వాడ్ 15వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా తిరిగి అగ్రస్థానం దక్కించుకున్నాడు. బౌలర్ల విభాగంలో అర్ష్‌దీప్ సింగ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 9వ స్థానంలో నిలిచాడు.