
IND Vs AUS: విదేశీ గడ్డపై సిరీస్ కైవసం.. చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ, సంజూ శాంసన్
ఈ వార్తాకథనం ఏంటి
జోహన్నెస్‌బర్గ్ వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో సంజూ శాంసన్, తిలక్ వర్మ అద్భుత సెంచరీలతో టీమిండియా సంచలన రికార్డులను సృష్టించింది.
నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో 135 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది. దీంతో సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం ఒక వికెట్ నష్టపోయి 283 పరుగుల భారీ స్కోరు సాధించింది.
సంజూ శాంసన్(109 నాటౌట్) తిలక్ వర్మ(120 నాటౌట్) అజేయ శతకాలతో 210 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ భాగస్వామ్యం టీ20 ఫార్మాట్‌లో ఏ వికెట్‌కైనా భారత్ తరఫున అత్యధికంగా నిలిచింది.
Details
భారత్ రికార్డుల జాబితా
1. ఒకే టీ20 ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు
భారత టీ20 చరిత్రలో ఇదే మొదటిసారి. సంజు శాంసన్, తిలక్ చెలరేగి ఆడటంతో ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశమూ లేకుండా చేసింది.
2. విదేశీ గడ్డపై అత్యధిక స్కోరు
283 పరుగులు నమోదు చేయడం ద్వారా, విదేశాల్లో భారత అత్యధిక టీ20 స్కోరును సాధించింది.
3. సంజూ శాంసన్ మూడు సెంచరీలు
ఒక క్యాలెండర్ ఇయర్‌లో మూడు టీ20 సెంచరీలు చేసిన మొదటి క్రికెటర్‌గా సంజూ నిలిచాడు.
Details
4. 23 సిక్సర్ల రికార్డు సమం
భారత్ ఒక టీ20 ఇన్నింగ్స్‌లో 23 సిక్సర్లు కొట్టి, గత రికార్డును సమం చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు భారత ఆటగాళ్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.
5. తిలక్ వర్మ రెండు వరుస సెంచరీలు
తిలక్ వర్మ వరుసగా రెండో సెంచరీ చేసిన సంజూ శాంసన్ రికార్డును సమం చేశాడు. 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఈ యువ క్రికెటర్ సత్తా చాటారు.
మ్యాచ్ విషయానికొస్తే 283 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు కేవలం 148 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లు విజృంభించి ప్రత్యర్థి బ్యాటర్లను ఎక్కడా నిలవనివ్వలేదు. ఈ విజయం ద్వారా భారత్, దక్షిణాఫ్రికాను వారి గడ్డపై ఓడించింది.