LOADING...
తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. అమ్మ కల నేరవేరిందన్న రింకూసింగ్!
తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. అమ్మ కల నేరవేరిందన్న రింకూసింగ్!

తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. అమ్మ కల నేరవేరిందన్న రింకూసింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2023
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత క్రికెట్ జట్టు నేటి నుంచి టీ20 సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన సెలక్టర్లు, ఐపీఎల్‌లో రాణించిన రింకూసింగ్, జితీశ్ శర్మకు ఈ పర్యటనలో అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో వీరిద్దరూ తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా తొలి అంతర్జాతీయ పర్యటనకు సంబంధించి అనుభవాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాను భారత జట్టుకు ఎంపికైనప్పుడు తన స్నేహితులతో కలిసి నోయిడాలో ప్రాక్టీస్ చేస్తున్నానని, వెంటనే అమ్మకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పానని రింకూ సింగ్ పేర్కొన్నారు.

Details

జాతీయ జట్టుకు గొప్ప గౌరవమన్న జితేశ్ శర్మ

అమ్మ కూడా తాను టీమిండియా తరుపున ఆడాలని కలలు కనిందని, ఇప్పుడు ఇద్దరి కల నెరవేరిందని, డ్రెస్సింగ్ రూములోకి వెళ్లి తన పేరుతో ఉన్న 35 నెంబర్ జెర్సీని చూడగానే ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని రింకూ సింగ్ చెప్పారు. టీమిండియాకు ఎంపిక కావడంతో సంతోషంతో మాటలు రావడం లేదని, భారత జట్టుతో కలిసి విదేశాల్లో పర్యటించడం గొప్ప అనుభవమని, జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం అనేది తనకు లభించిన గొప్ప గౌరవమని జితేశ్ శర్మ వెల్లడించారు. నేటి రాత్రి 7: 30 గంటలకు భార‌త్, ఐర్లాండ్ మ‌ధ్య‌ తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా.. తొలిసారి జట్టుకు ఎంపికైన రింకూ సింగ్‌‌పై అందరి కళ్లూ ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ షేర్ చేసిన వీడియో