ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్
ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ దుమ్ములేపాడు. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ట్రావిస్ హెడ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ హెడ్ యాషెస్ సిరీస్‌లో చెలరేగిపోతున్నాడు. ఇప్పటివరకూ 44.33 సగటుతో 266 పరుగులు చేశాడు. అతను మొదటి టెస్టులో 50, 16 రన్స్, హెడ్డింగ్లీలో 39, 77 పరుగులు, లార్డ్స్‌లో 77, 7 పరుగులు చేశాడు. ఇక న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో నిలిచాడు.
టెస్టు బౌలర్ల విభాగంలో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానం
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 13వ ర్యాంకులో ఉన్నాడు. మరోవైపు టీమిండియా తరుపున కేవలం ఒకే ఒక్క బ్యాటర్ టాప్ -10లో కొనసాగుతుండటం విశేషం. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మూడు స్థానాలు ఎగబాకి మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా ప్లేయర్స్ స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే రెండు స్థానాలు దిగజారి నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ ఒక స్థానం మెరుపర్చుకొని 12వ స్థానంలో నిలిచాడు. టెస్టు బౌలర్ల విషయంలో రవిచంద్రన్ అశ్విన్ 860 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ 828 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.