డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్.. సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్ బ్యాటర్ రికార్డును సృష్టించాడు. టీమిండియాతో జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా ట్రావిస్ హెడ్ రికార్డుకెక్కాడు. ఈ మ్యాచులో (106 బంతుల్లో 100 బ్యాటింగ్) వన్డే తరహాలో ఆడి సెంచరీ చేసి విజృంభించాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, ఓ సిక్సర్ నమోదైంది. ఇప్పటివరకూ డబ్ల్యూటీసీ ఫైనల్లో డెవాన్ కాన్వే చేసిన 54 పరుగులే అత్యధిక స్కోరుగా ఉండడం విశేషం ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఆ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా ఏకంగా సెంచరీతో చెలరేగాడు.
టీమిండియాపై మొదటి సెంచరీ బాదిన ట్రావిస్ హెడ్
ఇప్పటివరకూ ట్రావిస్ హెడ్ టెస్టులో ఆరు సెంచరీలను బాదాడు. ఇక టీమిండియాపై, విదేశాల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి ఆసీస్ 327 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (146 పరుగులు బ్యాటింగ్), స్టీవెన్ స్మిత్ (95 పరుగులు బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రెండు రోజు ఆటలో స్టీవెన్ స్మిత్ సెంచరీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, శార్దుల్ ఠాకూల్ కి తలా ఓ వికెట్ దక్కింది.