Page Loader
ICC Player Of The Month: ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు.
ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు

ICC Player Of The Month: ప్లేయర్ ఆఫ్ ది మంత్ బరిలో ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు.

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2023
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసు ఉత్కంఠంగా మారింది. ఈసారి పురుషుల విభాగం నుంచి ఏకంగా ఇద్దరు ఇంగ్లండ్ ఆటగాళ్లు బరిలో ఉన్నారు. యాషెస్ సిరీస్‌లో ఆద్భుతంగా రాణించిన ఓపెనర్ జాక్ క్రాలే, పేసర్ క్రిస్ వోక్స్ జూలై నెలకు సంబంధించి 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇక నెదర్లాండ్ ఆటగాడు బాస్ డీ లీడ్ బరిలో ఉండడం విశేషం. ఈ మధ్య ముగిసిన వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ ఈ మ్యాచులో బాస్ డీ లీడ్ విజృంభించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గరిలో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారినే విజేతగా ప్రకటించనున్నారు.

Details

యాషెస్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన జాక్ క్రాలే, వోక్స్

యాషెస్ సిరీస్‌లో జాక్ క్రాలే ఐదు టెస్టుల్లో కలిపి 480 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీని బాదాడు. మరోవైపు వోక్స్ మూడు టెస్టుల్లో కలిపి 19 వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. అదే విధంగా ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా వోక్స్ నిలిచాడు. ఇక నెదర్లాండ్స్ జట్టు వరల్డ్ కప్ కు అర్హత సాధించడానికి బాస్ డి లీడ్ కీలక పాత్ర పోషించాడు. స్కాట్లాండ్‌పై జరిగిన కీలకమైన మ్యాచులో 52 ప‌రుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టాడు.