LOADING...
Rohit sharma : రోహిత్ శర్మకు చేదు అనుభవం.. వైరల్‌గా మారిన వీడియో
రోహిత్ శర్మకు చేదు అనుభవం.. వైరల్‌గా మారిన వీడియో

Rohit sharma : రోహిత్ శర్మకు చేదు అనుభవం.. వైరల్‌గా మారిన వీడియో

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోహిత్ శర్మకు ఇటీవల అసౌకర్యకరమైన ఘటన ఎదురైంది. అభిమానులను పలకరిస్తూ కారులో కూర్చున్న సమయంలో ఇద్దరు చిన్నారులు ఆయన చేతికి ఉన్న వాచ్‌ను తీసుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీనిని గమనించిన రోహిత్ వెంటనే తన చేయిని వెనక్కి తీసుకుని, ఆ పిల్లలను హెచ్చరిస్తూ కార్ అద్దాలను మూసివేశాడు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయంపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే, దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది.

వివరాలు

రోహిత్ చేతికి రూ.3.25 కోట్ల వాచ్..

రోహిత్ ధరించిన వాచ్ ప్రముఖ 'రోలెక్స్ జిరాఫ్' మోడల్‌కు చెందినదిగా నెటిజన్లు పేర్కొంటున్నారు. ఆ విలాసవంతమైన గడియారం ధర సుమారు రూ.3.25 కోట్ల వరకు ఉండొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఇటీవల లక్నో సూపర్జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఆయన 44 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించాడు. అయితే, స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతోంది.

వివరాలు

ఆర్సీబీతో తలపడనున్న ముంబై..

జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు విజయాలు మాత్రమే నమోదు చేసింది. మిగిలిన మ్యాచ్‌లన్నింటిలో గెలిచినా, ప్లేఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబయి ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజెర్స్ బెంగళూరుతో మే 10న రాయ్ పూర్ లో తలపడనుంది.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో..

Advertisement