Page Loader
ODI World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచుకు అంపైర్లు ప్రకటన
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచుకు అంపైర్లు ప్రకటన

ODI World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచుకు అంపైర్లు ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 17, 2023
06:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈనెల 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టైటిల్ పోరులో భారత్-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచుకు విధులు నిర్వహించే అంపైర్లను ఐసీసీ తాజాగా ప్రకటించింది. మైదానంలో రిచర్డ్ కెటిల్ బరో, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. జోయెల్ విల్సన్ థర్డ్ అంపైర్ గా విధులు నిర్వర్తించనున్నారు. ఇక రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ వ్యవహరించనున్నారు. 50 ఏళ్ల రిచర్డ్ కెటిల్ ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడాడు. ఇప్పటివరకూ రిచర్డ్ కెటిల్ 112 టెస్టులు, 159 వన్డేలు, 51 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ల్లో అంపైరింగ్ విధులు నిర్వర్తించాడు.

Details

ఇంగ్లండ్ తరుపున 92 టెస్టులాడిన రిచర్డ్ ఇల్లింగ్

ఇక రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ కూడా బ్రిటన్‌కు చెందినవాడు. ఇంగ్లండ్ తరుపున జాతీయ జట్టుకు ఆడాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత అంపైరింగ్ వైపు అడుగులు వేశారు. ఇప్పటివరకూ ఆయన 92 టెస్టులు, 159 వన్డేలు, 40 అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో అంపైర్‌గా వ్యవహరించాడు. ఇదిలా ఉండగా, టీమిండియా, ఆస్ట్రేలియా హై ఓల్టోజ్ మ్యాచు కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మ్యాచును వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నట్లు తెలిసింది.