Tanmay Srivastava: అండర్ -19వరల్డ్ కప్ స్టార్.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్!
ఈ వార్తాకథనం ఏంటి
2008 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాకు కీలక ఇన్నింగ్స్ ఆడిన తన్మయ్ శ్రీవాస్తవ (Tanmay Srivastava) ఇప్పుడు కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు.
విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలతో కలిసి ఆ వరల్డ్ కప్‌లో అదరగొట్టిన అతడు, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఐదేళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలికాడు.
అయితే మైదానం నుంచి పూర్తిగా వెళ్లిపోకుండా, ఇప్పుడు అంపైర్‌గా కొత్త పాత్ర పోషించనున్నాడు. ఈమేరకు అతడి ఎంపికపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.
Details
ఐపీఎల్ అంపైర్‌గా తన్మయ్ ఎంపిక
దేశవాళీ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, శ్రీవాస్తవ వ్యాఖ్యాతగా మారాడు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కోసం అతడిని అంపైర్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.
ఈ విషయాన్ని ఉత్తర్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) సోషల్ మీడియాలో వెల్లడించింది.
నిజమైన ఆటగాడు మైదానం వీడాలనుకోడు. ఇక్కడ పాత్ర మాత్రమే మారింది. తన్మయ్ శ్రీవాస్తవకు ఆల్ ది బెస్ట్ అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
Details
2008 వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీవాస్తవ కీలక ఇన్నింగ్స్
2008 అండర్-19 వరల్డ్ కప్‌ను విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా గెలుచుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 159 పరుగులకే ఆలౌటైంది.
ఈ కఠిన స్థితిలో తన్మయ్ మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి 46 పరుగులతో భారత జట్టును ఆదుకున్నాడు. ఆ ఇన్నింగ్స్ లేకుంటే భారత్ మరింత కష్టాల్లో పడేది.
కోహ్లీ 19 పరుగులు చేశాడు. చివరికి భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను 103/8కే నిలువరించగా, వర్షం రావడంతో డక్‌వర్త్-లూయిస్ పద్ధతి ప్రకారం 12 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
ఇప్పుడు అదే శ్రీవాస్తవ క్రికెట్‌లో తన కొత్త ఇన్నింగ్స్‌ను అంపైర్‌గా ప్రారంభించనున్నాడు