NZ vs SL: న్యూజిలాండ్ జట్టుకి వరుణుడి గండం. పాకిస్థాన్‌కు కలిసొచ్చే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ న్యూజిలాండ్, శ్రీలంక జట్లకు వర్షం ముప్పు పొంచి ఉంది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు వరుణుడికి భయం పట్టుకుంది.
ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే పాకిస్థాన్‌కు కలిసొచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరాయి. ఫోర్త్ ప్లేస్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి.
ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ అదృష్టాన్ని ఇవాళ శ్రీలంకతో పరీక్షంచుకోనుంది.
ఈ మ్యాచులో న్యూజిలాండ్ విజయం సాధిస్తానే సెమీస్ కు వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి.
ఓడిపోతే మరింత క్లిష్టతరంగా మారుతాయి. గురువారం 80శాతం వర్షం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Details
వర్షం పడే అవకాశాలు ఎక్కువ
గురువారం ఉదయం, మధ్యాహ్నం వేదిక వద్ద వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణశాఖ సూచిస్తోంది.
రోజంతా ఆకాశం మేఘావృతమై, అడపాదడపా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచు రద్దు అయితే ఇరు జట్లుకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు మొత్తం 9 పాయింట్లు వస్తాయి.
మరోవైపు శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఆఫ్ఘనిస్థాన్ తలపడుతోంది. పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండూ తమ తమ మ్యాచ్‌లలో ఓడిపోతే ఆఫ్గాన్ సెమీస్ కు చేరే అవకాశం ఉంటుంది.