
Vinesh Phogat: పారిస్ నుంచి స్వదేశానికి వినేష్ ఫోగాట్.. భావోద్వేగానికి గురైన భారత రెజ్లర్
ఈ వార్తాకథనం ఏంటి
పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి చేరుకుంది.
ఈ సందర్భంగా దిల్లీ విమానాశ్రయంలో అమెకు అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది.
అభిమానుల కోరిక మేరకు ఎయిర్ పోర్టు నుంచి ఆమె ఓపెన్ టాప్ కారులో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వినేశ్ కు పూలదండలు, కరెన్సీ నోట్లతో చేసిన మాలలు వేశారు. దీంతో వినేశ్ తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన ఆమె, 100 గ్రాముల అదనపు బరువు కారణంగా అనర్హతకు గురైన విషయం తెలిసిందే.
Details
ఓదార్చిన దీపించర్ హుడా, సాక్షి మాలిక్
కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ లో అప్పీలు చేసిన ఆమెకు ఫలితం దక్కలేదు. ఆమె విజ్ఞప్తిని కాస్ కొట్టిపడేసింది.
తాజాగా ఆమె భారత్‌కు రావడంతో ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
అభిమానులను చూసి వినేశ్ కన్నీళ్లు పెట్టుకోవడంతో కాంగ్రెస్ ఎంపీ దీపించర్ హుడా, రెజర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా ఓదార్చారు.