Virat - KL Rahul: గాయం కారణంగా రంజీ మ్యాచ్‌ల నుంచి విరాట్, కేఎల్ రాహుల్ దూరం
ఈ వార్తాకథనం ఏంటి
జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.
దిల్లీ క్రికెట్ సంఘం తమ జాబితాలో రిషభ్ పంత్‌తోపాటు విరాట్ కోహ్లీకి చోటు కల్పించింది. అయితే మెడ నొప్పి కారణంగా విరాట్ కోహ్లీ ఆడతాడా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ విషయాన్ని బీసీసీఐకి కోహ్లీ సమాచారాన్ని అందించారని వార్తలు వస్తున్నాయి. ఆసీస్ పర్యటనలో చివరి టెస్టు సందర్భంగా అతడికి మెడ నొప్పి ఏర్పడిందని, దీని కోసం ఇంజెక్షన్లను కూడా వాడుతున్నట్లు తెలిపాయి.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ దృష్ట్యా గాయం నుంచి కోలుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించిందని తెలుస్తోంది.
కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటంపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Details
సౌరాష్ట్ర తరుపున బరిలోకి దిగనున్న రవీంద్ర జడేజా
ఇందులో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ గాయం కారణంగా రంజీ మ్యాచ్‌ల్లో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంది.
ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో మెడ నొప్పి కలిగిన రాహుల్, కర్ణాటక జట్టుతో పంజాబ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐకి తెలిపారు.
మరోవైపు శుభ్‌మన్ గిల్ పంజాబ్ జట్టుతో, రవీంద్ర జడేజా సౌరాష్ట్ర జట్టుతో బరిలోకి దిగనున్నాడు. కరుణ్ నాయర్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్, కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించారు. కరుణ్ నాయర్ రిజర్వ్‌గా కాదని, ఫైనల్ XIలో ఆడించాలని చెప్పారు.
జట్టులో తీసుకునేందుకు అతడికి అవకాశం లేకపోతే, స్క్వాడ్‌లో కూడా తీసుకోకూడదని రామన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.