
ICC Rankings లో దుమ్మురేపిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ (ICC ODI Rankings) ను విడుదల చేసింది.
ఈ ర్యాకింగ్స్‌లో రోహిత్, కోహ్లీ దుమ్మురేపారు.
వరల్డ్ కప్ అద్భుత ప్రదర్శన చేయడంతో విరాట్ కోహ్లీ (Virat Kohli) 791 పాయింట్లతో మూడో స్థానానికి చేరాడు.
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) 769 పాయింట్లతో నాలుగు స్థానానికి ఎగబాకాడు.
ఇక 826 రేటింగ్ పాయింట్లతో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బాబార్ ఆజం 824 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు
Details
మూడో స్థానంలో మహ్మద్ సిరాజ్
ఒక బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మహ్మద్ సిరాజ్ మూడో స్థానం, మహ్మద్ షమీ 10వ స్థానంలో కొనసాగుతున్నారు.
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 741 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు.
ఇక బుమ్రా నాలుగో స్థానంలో, కుల్దీప్ యాదవ్ ఆరో స్థానంలో ఉన్నారు.
టీమిండియా నుంచి నలుగురు బౌలర్లు టాప్ 10లో ఉండడం విశేషం.