
Virat Kohli: ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ నయా రికార్డు.. సచిన్ టెండూల్కర్ రికార్డు సమం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Viarat Kohli) సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
నిన్న బెంగళూరు వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచ కప్ చివరి లీగ్ మ్యాచులో కింగ్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
సచిన్ అత్యధిక వన్డే సెంచరీల రికార్డును ఈ మ్యాచులోనే విరాట్ బద్దలు కొడతాడని అందరూ అశించారు.
అయితే తన 71వ హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే కోహ్లీ ఔట్ అయ్యాడు.
ఈ క్రమంలో సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును కోహ్లీ సమం చేశాడు.
ప్రపంచ కప్‌లో 50 కంటే ఎక్కువ స్కోర్లు అధిక మ్యాచుల్లో (7 మ్యాచుల్లో) చేసిన సచిన్ రికార్డును విరాట్ సమం చేయడం విశేషం.
Details
అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ
2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ 7 సార్లు 50ప్లస్ స్కోర్లు సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
దీని తర్వాత, 2019లో బంగ్లాదేశ్ జట్టు ఆటగాడు షకీబ్ అల్ హసన్ కూడా 50 కంటే ఎక్కువసార్లు 7 సార్లు చేసి మెరిశాడు.
ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ 9 ఇన్నింగ్స్‌లో 594 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలను బాదాడు.