
Virat Kohli: ఇన్‌స్టాలో కోహ్లీ ఒక్క పోస్టు పెడితే రూ.11.45 కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు.
ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుల్లో కోహ్లీ ఒకడు. ఒక్క ఇన్ స్టాలోనే కోహ్లీకి 256 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్ స్టా ద్వారా అతను భారీగానే ఆదాయాన్ని పొందుతున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న స్పోర్ట్స్ సెలబ్రిటిల్లో ప్రపంచంలోనే టాప్ 3 స్థానంలో ఉన్నాడు. దీంతో ఇన్ స్టాలో ఒక్క పెయిడ్ పోస్టు పెడితే రూ.11.45 కోట్లు అర్జిస్తారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
Details
అగ్రస్థానంలో క్రిస్టియానో రోనాల్డ్
2023లో ప్రముఖ ఫోటో, వీడియో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్‌లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న జాబితాలో ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డ్ అగ్రస్థానంలో నిలిచాడు. రోనాల్డ్ ఒక్కో ఇన్ స్టా పోస్ట్ ద్వారా 26.7 కోట్లు సంపాదిస్తున్నారు.
ఇక అర్జెంటీనా ప్లేయర్ లియోనల్ మెస్సీ రూ. 21.5 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
రోనాల్డ్, మెస్సీ తర్వాత ఇన్ స్టా ద్వారా అత్యధిక మొత్తం ఆర్జిస్తున్న మూడో స్పోర్ట్స్ ప్లేయర్ గా కోహ్లీ నిలిచాడు.
ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో విరాట్ కోహ్లీకి A+ కేటగిరిలో చోటు లభించిన విషయం తెలిసిందే.
ఏడాదికి బీసీసీఐ నుంచి విరాట్ కోహ్లీ రూ.7 కోట్లు అందుకోనున్నాడు.