Page Loader
Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ
దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ

Virat Kohli: దిల్లీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. శుభవార్తను అందించిన బీసీసీఐ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

విరాట్ కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. జనవరి 30 నుంచి రంజీ ట్రోఫీ చివరి రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. రోస్టర్ విధానంలో మూడు మ్యాచ్‌లను మాత్రమే లైవ్ స్ట్రీమింగ్‌కు అవకాశం ఉంది. మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడడం లేదని భావించినా బీసీసీఐ తన నిర్ణయాన్ని చివరి క్షణంలో మార్చింది. జియో సినిమా ఓటీటీలో దిల్లీ మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయనుందని బీసీసీఐ అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో, విరాట్ కోహ్లీని ప్రత్యక్షంగా చూడలేని ప్రేక్షకులకు ఇది శుభవార్తగా మారింది.

Details

కుర్రాళ్లకు సలహాలిచ్చిన విరాట్ కోహ్లీ

కోహ్లీ ఇప్పటికే దిల్లీ స్క్వాడ్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. దిల్లీలో ప్రాక్టీస్ చేస్తుండగా, విరాట్ కోహ్లీ కుర్రాళ్లకు సలహాలు ఇచ్చి కనిపించాడు. అదే సమయంలో, కోహ్లీ దగ్గరకు ఓ బాలుడు వచ్చి, భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టుకు చేరాలంటే ఏమి చేయాలో అడిగాడు. 'మీరు సాధన చేయకపోతే ఎవరూ మీకు చెప్పరు. ఉదయాన్నే లేచి ప్రాక్టీస్ చేయాలని కోహ్లీ జవాబిచ్చాడు. ఆ బాలుడు షావెజ్ కుమారుడు కబీర్. అతను నాలుగో తరగతి చదువుతున్నాడు.

Details

 కేఎల్ రాహుల్ పైన దృష్టి 

ఆస్ట్రేలియా పర్యటనలో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్, కొన్ని మ్యాచుల్లో మెరిశాడు. అతడు ఈ సారి రంజీ మ్యాచ్‌లో కర్ణాటక తరఫున ఆడనున్నాడు. కర్ణాటక హరియాణాతో తలపడనుంది. కేఎల్ రాహుల్ ఆడే మ్యాచ్ కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే పంజాబ్-బెంగాల్, బరోడా-జమ్మూకశ్మీర్ మ్యాచ్‌లను కూడా బీసీసీఐ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. గత మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్, ముంబయి జట్టుపై అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే.