
Virat kohli:టెస్ట్ క్రికెట్ కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకోనుందా? స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు అతడి మాదిరిగానే కోహ్లీ కూడా అదే దారిలో సాగేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది.
ఈఅంశంపై ఇప్పటికే బీసీసీఐతో కొంత చర్చ జరిగిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
కోహ్లీ తన టెస్టు భవిష్యత్తును త్వరలోనే నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం.
జూన్ నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
తన రిటైర్‌మెంట్ నిర్ణయాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకోవాలని కోహ్లీ కోరినట్లు తెలిసింది.
వివరాలు
టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ,రవీంద్ర జడేజా
ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బిజీగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో, కోహ్లీ కూడా అన్ని ఫార్మాట్లకు విడివిడిగా వీడ్కోలు పలకనున్నాడా? అనే చర్చలు అందులోనూ కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.