Page Loader
ICC World Cup 2023: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు దక్కని చోటు! 
కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు దక్కని చోటు!

ICC World Cup 2023: కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు దక్కని చోటు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 13, 2023
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ప్రపంచ కప్ 2023లో లీగ్ దశ ముగిసిపోయింది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరాయి. ఈ నాలుగు జట్ల మధ్య నవంబర్ 15, 16వ తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచులో న్యూజిలాండ్, భారత జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండో మ్యాచులో ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఎ) తన వరల్డ్ కప్ 2023 టీమ్ ను ప్రకటించింది.

Details

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టు ఇదే

ఈ ప్రపంచ కప్ టోర్నీలో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లతో కూడిన 12 మంది జట్టును వెల్లడించింది. అత్యధికంగా భారత్ నుంచి నలుగురు ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా స్థానం కల్పించింది. ఇక దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి చెరో ముగ్గురిని ఎంపిక చేశారు. ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేయగా, టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌లో రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీని సీఏ ఎంచుకుంది. క్రికెట్ ఆస్ట్రేలియా జట్టు క్వింటన్ డికాక్ (కీపర్), డేవిడ్ వార్నర్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ‌ (కెప్టెన్), ఎయిడెన్ మార్క్‌రమ్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కొ జెన్‌సెన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, జస్‌ప్రీత్ బుమ్రా, దిల్షాన్ మదుశంక.