విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే ఇంత పెద్ద విజయం : హార్ధిక్ పాండ్యా
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచులో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు భారీ స్కోరును చేయగలిగింది.
మ్యాచ్ అనంతరం హార్ధిక్ పాండ్యా కొన్ని వ్యాఖ్యలను చేశాడు. వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్‌ను నెగ్గడం ఎంతో ప్రత్యేకమైందని, గత వన్డేల్లో ఓటమి తర్వాత విమర్శలు వచ్చాయని, ఒత్తిడిని ఎదుర్కొని కుర్రాళ్లు సమిష్టిగా రాణించారని హార్ధిక్ పాండ్యా చెప్పారు.
సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకపోయినా యువ ఆటగాళ్లు గొప్పగా రాణించారని కొనియాడారు.
Details
బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రాణిస్తున్న హార్ధిక్ పాండ్యా
ఈ మ్యాచుకు ముందు విరాట్ కోహ్లీతో జరిగిన సంబాషణ ఎంతో ఉపయోగపడిందని, క్రీజులో ఎక్కువ సమయం ఉండాలని సలహా ఇచ్చారని, కోహ్లీ తన అనుభవాన్ని తనతో పంచుకున్నదని హార్ధిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ లోనూ రాణిస్తుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు.
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన విండీస్ జట్టు 151 పరుగులకే ఆలౌటైంది.