ఐసీసీ టోర్నీల్లోనే భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ చరిత్రలోనే విరాట్ కోహ్లీ అరుదైన ఘనతలను సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు ప్రపంచకప్ టోర్నీ సహా ఐసీసీ ఈవెంట్లలో భాగంగా టీమిండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ప్రతిభతో పలు రికార్డులను లిఖించుకున్నాడు. 116 బంతుల్లో 85 పరుగులు చేసిన కోహ్లీ, ICC తెల్లబంతి టోర్నమెంట్లలో(ODI WC, T20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ) కలిపి భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు
ప్రపంచకప్ ఈవెంట్లలో అత్యధిక అర్థసెంచరీలు
67 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 64.76 సగటుతో 2 సెంచరీలు, 26 అర్థసెంచరీలతో 2,785 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ (2,719)ను అధిగమించాడు. మరోవైపు మహేల జయవర్ధనే (2,858), కుమార సంగక్కర (2,876), క్రిస్ గేల్ (2,942) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. ప్రపంచకప్ ఈవెంట్లలో అత్యధిక అర్థసెంచరీలు : ప్రపంచకప్ ఈవెంట్లలో (ODIలు, T20Iలు కలిపి) అత్యధిక అర్థ సెంచరీల రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. 23 సార్లు 50 పరుగులను సాధించాడు. మొత్తంగా కోహ్లీ 28 అర్థంసెంచరీలను నమోదు చేశాడు. 21 అర్థంసెంచరీలతో సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు.
ఏకైక భారతీయుడు టెండూల్కర్
ప్రపంచకప్ లో 10వ ఆటగాడు : ODI WCలలో 10వ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీకి గుర్తింపు ఉంది. 27 ODI WC మ్యాచ్‌ల్లో, 48.47 సగటుతో 1,115 పరుగులు చేశాడు. 2,278 పరుగులతో, కోహ్లీ కంటే ఎక్కువగా WCలో పరుగులు చేసిన ఏకైక భారతీయుడు సచిన్ టెండూల్కర్. 2011, 2015, 2019లో ఆడిన కోహ్లీ ప్రస్తుతం నాలుగో ప్రపంచకప్ ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 500కుపైగా పరుగులు : మినీ వరల్డ్ కప్ (2009, 2013, 2017)గా ప్రశంసలు అందుకున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ 3 సార్లు ఆడాడు.
పొట్టి ప్రపంచకప్ లోనూ నాలుగుసార్లు ప్రాతినిథ్యం
మొత్తం 13 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ 88.16 సగటుతో 529 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ (701), సౌరవ్ గంగూలీ (665), రాహుల్ ద్రవిడ్ (627) మాత్రమే అతని కంటే ముందున్నారు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు : ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో 27 మ్యాచ్‌ల్లో 1,141 పరుగులతో కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు. 2022 ఈవెంట్‌లో శ్రీలంక లెజెండ్ జయవర్ధనే (1,016)ను అధిగమించాడు. ఇప్పటివరకు నాలుగు T20 WC (2012, 2014, 2016 సహా 2022)లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.