Virat Kohli : పింక్-బాల్ టెస్టుల్లో విరాట్ కోహ్లి రికార్డు.. గణాంకాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా, టీమిండియా ,ఆస్ట్రేలియా, ఆడిలైడ్ ఓవల్ వేదికగా పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతున్నాయి.
డే అండ్ నైట్ ముద్రతో జరుగబోయే ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శన చాలా కీలకంగా మారనుంది.
పింక్ బాల్ టెస్టులలో విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది.
ఇప్పటివరకూ భారత్ ఎన్ని పింక్ బాల్ టెస్టులు ఆడింది.. ఎన్ని విజయాలు నమోదు చేసింది..? విరాట్ రికార్డులపై ఓ లుక్కేస్తే..
ఇప్పటి వరకు, టీమిండియా మొత్తం నాలుగు పింక్ బాల్ టెస్టులు అడగా . . అందులో మూడు టెస్టుల్లో విజయం సాధించింది.
వివరాలు
నవంబర్ 2019 - ప్రత్యర్థి: బంగ్లాదేశ్
కోల్‌కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఈ టెస్టు భారతావనికి తొలి పింక్ బాల్ మ్యాచ్.ఈ మ్యాచ్‌లో భారత్ 46పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. కోహ్లీ,136పరుగులతో అద్భుతంగా ఆడాడు, 194బంతులలో ఈ స్కోరును సాధించాడు.
డిసెంబర్ 2020-ప్రత్యర్థి: ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టెస్టులో భారత్ ఘోర పరాభవాన్ని చవి చూసింది.రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులే సాధించి,8వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 74పరుగులు చేసి,రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు మాత్రమే చేశాడు.
ఫిబ్రవరి 2021-ప్రత్యర్థి: ఇంగ్లండ్
అహ్మదాబాద్‌లో జరిగిన ఈ పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది.ఇంగ్లండ్‌పై 10 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.కోహ్లీ ఒకసారి మాత్రమే బ్యాటింగ్‌కు వచ్చి 27 పరుగులు చేశాడు.
వివరాలు
మార్చి 2022 - ప్రత్యర్థి: శ్రీలంక
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారత్ ఆడిన ఈ పింక్ బాల్ టెస్టులో శ్రీలంకపై 238 పరుగుల తేడాతో విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ గణాంకాలు
నాలుగు పింక్ బాల్ టెస్టుల్లో కోహ్లీ మొత్తం 277 పరుగులు చేశాడు.
పింక్ బాల్ టెస్టుల్లో భారత్ తరఫున అతడే అత్యధిక స్కోరు సాధించేవాడు, అతడి బ్యాటింగ్ సరాసరి 46.17.
కోహ్లీ ఒక శతకం నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌పై అతడిది అత్యుత్తమ స్కోరు, 136 పరుగులు.
కెప్టెన్‌గా రెండు విజయాలు సాధించాడు.
పింక్ బాల్ టెస్టుల్లో కోహ్లీ 33 ఫోర్లు బాదాడు.
బంగ్లాదేశ్‌పై రహానెతో కలిసి 4వ వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు, ఇది అతడి అత్యధిక భాగస్వామ్యం.
వివరాలు
సిరీస్‌లో 1-0 ఆధిక్యం
ప్రస్తుతం, భారత్ ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
భారత అభిమానులు కోహ్లీ మరింత రాణించాలనే ఆశలో ఉన్నారు, తద్వారా పింక్ బాల్ టెస్టులో అతడు మరోసారి అద్భుత ప్రదర్శన చేస్తాడని ఆసిస్తున్నాడు