Virat Kohli: అదే నా వీక్నెస్ గా మారింది: విరాట్ కోహ్లి
ఈ వార్తాకథనం ఏంటి
పేలవ ఫామ్‌ను అధిగమిస్తూ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన శతకంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.
కవర్‌డ్రైవ్ అంటేనే కోహ్లికి ప్రత్యేక గుర్తింపు. కానీ ఇటీవల ఇదే షాట్ అతని బలహీనతగా మారిందని, అనేకసార్లు ఈ షాట్‌కు ప్రయత్నించేటప్పుడు స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతున్నానని కోహ్లి అంగీకరించాడు.
అయితే, పాక్‌పై మ్యాచ్‌లో మాత్రం తన ట్రేడ్‌మార్క్ కవర్‌డ్రైవ్‌లతో అభిమానులను అలరించాడు.
వివరాలు
కోహ్లి వన్డేల్లో 14,000పరుగులు
"కవర్‌డ్రైవ్ నాకు రెండు కోణాల్లో ఉంది.ఇది నన్ను విజయానికి నడిపించగలదు, కానీ అదే సమయంలో ఒత్తిడిలోనూ పెట్టగలదు. కానీ నేడు నా షాట్లను నమ్ముకున్నాను. తొలి రెండు బౌండరీలు కవర్‌డ్రైవ్ ద్వారానే వచ్చాయి. ఇలాంటి షాట్లతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నియంత్రణలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఇది నాకు ప్రత్యేక ఇన్నింగ్స్.జట్టుకు గొప్ప విజయాన్ని అందించగలిగాను," అని బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో కోహ్లి అన్నాడు.
శతకాన్ని పూర్తి చేసే క్రమంలో కోహ్లి వన్డేల్లో 14,000పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ,"ఈ స్థానంలో నేను ఎప్పుడూ ఒకే లక్ష్యంతో ఉంటా - జట్టును విజయానికి చేర్చడం.మ్యాచ్ పరిస్థితి ఎలా ఉన్నా,నా పాత్రలో ఎలాంటి మార్పు లేదు,"అని కోహ్లి వివరించాడు.
వివరాలు
"కోహ్లి సెంచరీ కోసం లెక్కలు వేసుకున్నా!":అక్షర్ పటేల్
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి శతకం పూర్తి చేయగలడా అనే ఉత్కంఠ అభిమానులకే కాదు,జట్టు సభ్యులకు కూడా ఉందని అక్షర్ పటేల్ వెల్లడించాడు.
మ్యాచ్ చివరి దశలో కోహ్లి 86 పరుగుల వద్ద ఉండగా, భారత్ విజయానికి ఇంకా 19 పరుగులు అవసరమైంది. అక్షర్ క్రీజులో అడుగుపెట్టాడు.
"కోహ్లి శతకం పూర్తవ్వాలని నేను కూడా ఆశపడ్డా. బ్యాటు అంచున బంతి తాకకూడదని ప్రార్థించా," అని తెలిపాడు."నా కెరీర్‌లో ఇటువంటి ఒత్తిడిని చూస్తూ, క్రీజులో ఉండటం ఇదే తొలిసారి. కోహ్లి అద్భుతంగా ఆడాడు. 50 ఓవర్ల ఫీల్డింగ్ తర్వాత వికెట్ల మధ్య పరుగెత్తిన విధానం కోహ్లి ఫిట్‌నెస్ స్థాయికి నిదర్శనం'' అని అక్షర్ వివరించాడు.