Rohit Sharma : వాంఖడే స్టేడియం నాకెంతో ప్రత్యేకమైనది : రోహిత్ శర్మ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం శ్రీలంకతో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ రోజు ఒక క్రికెటర్‌గా ఉన్నానంటే దానికి కారణం వాంఖేడే స్టేడియమని, ఈ మైదానంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు. వాంఖేడే స్టేడియం తనకెంతో ప్రత్యేకమైందని, ఇది బెస్ట్ స్టేడియమని హిట్ మ్యాన్ కొనియాడారు. ఈ స్టేడియంలో ముంబాయివాసుల క్రికెట్ అభిమాన్ని కొలవడం కూడా అసాధ్యమని, స్టేడియంలోని ప్రతి స్టాండ్‌కు ఓ ప్రత్యేకత ఉందని ముఖ్యంగా ఉత్తరం వైపున ఉండే స్టాండ్ ఎంతో ప్రసిద్ధి అని కొనియాడారు.
అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
మరో మూడు సిక్స్ లు కొడితే ఒకే ఏడాది క్యాలెండర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ రోహిత్ శర్మ(56) రికార్డుకెక్కనున్నాడు. 2015లో దిగ్గజ ఆటగాడు ఏబీ డివిలియర్స్ 18 ఇన్నింగ్స్‌ల్లో 58 సిక్సలు కొట్టాడు. ఇక చాలా ఏళ్లు ముంబై జట్టుకు ఆడుతున్న రోహిత్ శర్మ, ఆ జట్టుకి ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు. రేపు జరగబోయే మ్యాచుకి రోహిత్ సతీమణి రితికా, కుమార్తె సమైరా హజరుకానున్నారు.