Page Loader
మైఖేల్ వాన్‌కు వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్
మైఖేల్ వాన్ కు కౌంటర్ ఇచ్చిన వసీం జాఫర్

మైఖేల్ వాన్‌కు వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2023
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా అనేక సార్లు మాటల యుద్దానికి దిగారు. ముఖ్యంగా టీమిండియా పేలవ ప్రదర్శన కనబర్చిన ప్రతీసారి మైఖేల్ వాన్ విమర్శలు చేసి, జాఫర్ ని ట్యాగ్ చేసేవాడు. దీనికి జాఫర్ కూడా తనదైన శైలిలో బదులిచ్చేవాడు. హలో మైఖేల్ వాన్.. చాలా రోజులైంది నిన్ను చూడక అని వసీం జాఫర్, మైఖైల్ వాన్ ను ట్యాగ్ చేశాడు. దీనికి బంగ్లాదేశ్ కోచ్ స్టాఫ్ డ్రెస్స్‌లో ఉన్న తన ఫోటోను కూడా వసీం జాఫర్ జత చేశాడు

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి

.తాజాగా బంగ్లాదేశ్ గడ్డపై ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లో చిత్తుగా ఓడగా.. మరోవైపు మైఖైల్ వాన్ పత్తా లేకుండా పోయారు. దాంతో వసీం జాఫర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ ట్వీట్‌పై మైఖేల్ వాన్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో వేచి చూడాల్సిందే ఇంగ్లండ్ ఆట తీరు చూసాక.. మైఖేల్ వాన్ దాక్కున్నాడని, పత్తా లేకుండా పోయాడని కామెంట్ చేస్తున్నారు. గతంలో బంగ్లాదేశ్ కోచ్ గా వసీం జాఫర్ సేవలందించాడు. ఇక మంగళవారం జరిగిన చివరి టీ20లోనూ ఇంగ్లండ్ 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.